Bunny Vas Comments on Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని ‘ఆయ్” చిత్ర యూనిట్ దర్శించుకుంది. ఈ క్రమంలో ఆయ్ సినిమా నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర కామెంట్స్ చేశారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ ను నెగ్గించుకుని సినిమా ఇండస్ట్రీకి చాలా ఇచ్చిందని, పిఠాపురానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పిఠాపురంలో ట్రైలర్ లాంచింగ్ నిర్వహించామని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అనేక కార్యక్రమాలు పిఠాపురంలో జరుగుతుంటాయి, అందుకు నేను ఈరోజు మొదటి అడుగు వేయడం జరిగిందని అన్నారు.
Simba Movie: మొక్కలు నాటండి.. ఫ్రీగా సింబా సినిమా చూసేయండి!
వచ్చే రోజుల్లో చిత్ర నిర్మాణ పనులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరగాలని కోరుకుంటున్నానని పేర్కొన్న ఆయన పవన్ కళ్యాణ్ ను నెగ్గించడంతో ఇప్పుడు పిఠాపురం అనేది మామూలు ఊరు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనదని అన్నారు. నూటికి నూరు శాతం రోజు రోజుకి పిఠాపురం బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా ఆయ్ అనే సినిమా తెరకెక్కింది. అంజి కే మణిపుత్ర అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే థియేటర్లు సర్దుబాటు వ్యవహారంలో భాగంగా ఒకరోజు వాయిదా పడింది. కానీ ఆగస్టు 15వ తేదీ సాయంత్రం ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించాలని సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది.