బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. స్టేడియంలోని ఓ అభిమాని బారికేడ్లు దాడి మరీ మైదానంలోకి దూసుకొచ్చి.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఆలింగనం చేసుకొనేందుకు ప్రయత్నించాడు. హగ్ చేసుకొనేందుకు కుదరకపోవడంతో.. కోహ్లీపై చేయి వేసి పోజులు ఇచ్చాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి.. ముందుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ…