Pilli Subhash Chandra Bose: పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలపై అందరికీ నమ్మకం పోయింది.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పై నమ్మకం లేదు.. బీజేపీ మినహా అని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని వెల్లడించారు.
పొరపాటున కూడా నేను పార్టీ మారను.. వైసీపీలోనే ఉంటాను అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్.. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంతో ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు.. విజయసాయి రెడ్డి రాజీనామా దురదృష్టకరం అన్నారు.. విజయసాయి రెడ్డి పార్టీకి, పార్లమెంట్ లోనూ వెన్నెముక లాంటివారని అభివర్ణించారు.
తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని వైసీపీ రాజ్యసభ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. మా రాజ్యసభ సభ్యులు ఇంకెవరూ రాజీనామా చేయడం లేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం ముందు నుంచి తాను జగన్ వెంట ఉన్నానని.. మంత్రి పదవి వుండగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచానని ఆయన పేర్కొన్నారు.
వైసీపీకి చెందిన ఆ రాజ్యసభ్యుడు టీడీపీలోకి జంప్ కొట్టేస్తారా? టీడీపీ గాలం ఆల్రెడీ ఆయనకు టచ్ అయిందా? పైకి ఆయన లేదు లేదంటున్నా…. ప్రచారం మాత్రం ఆగడం లేదు ఎందుకు? ఊ.. అంటావా…ఉఊ.. అంటావా అంటూ టీడీపీ ఎదురు చూస్తోందన్నది నిజమేనా? ఇంతకీ ఎవరా ఎంపీ? వెనకున్న కథేంటి? పిల్లి సుభాష్‌చంద్రబోస్…. వైసీపీకి వీర విధేయుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఏకైక రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడాయనకు టీడీపీ గాలం వేస్తోందన్న ప్రచారం కలకలం రేపుతోంది.…
వైసీపీకి పిల్లి బోస్ గుడ్‌బై చెబుతారనే చర్చ జోరుగా సాగుతోంది.. ఇదే సమయంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోంది.. ఇక, ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట బోస్.. ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌ను సైతం ఖాళీ చేసే ప్రయత్నాల్లో పిల్లి బోస్ ఉన్నారని తెలుస్తోంది.
రామచంద్రాపురం పంచాయితీపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.. ఎంపీ పిల్లి బోస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీఎంతో జరిగిన సమవేశంలో మంత్రి వేణు గోపాలకృష్ణ తీరుపై ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు బోస్.. నియోజకవర్గంలో మంత్రి వేణు సహా ఆయన వర్గీయుల వ్యవహారశైలిని సీఎంకు పిల్లి సుభాష్ వివరించారు.