Pilli Subhash Chandra Bose Fires On Central Govt On BC Issue: బీసీ కుల గణనపై కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ జన గణన కోసం సీఎం జగన్ ప్రయత్నం చేస్తే, హైకోర్టు స్టే విధించిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విధించిన పరిమితి మేరకు బీసీలకు సీఎం రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల్లో కూడా జగన్ రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. బీసీ కుల గణన కోసం జరిపే పోరాటానికి మల్లాడి నాయకత్వం వహించాలని కోరారు. సత్తా ఉన్న ధీరుడు, వీరుడు మల్లాడి.. కుర్చీలు కదిలిపోయేలా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానికి కుతూహలం ఉన్నా.. వెనుకున్న వారు చేయనివ్వరని ఆరోపించారు. కుల గణన కోసం ఉద్యమం చేయాలని చెప్పారు. బీసీ గణనపై కేంద్రం స్పందించడం లేదని మండిపడ్డారు. ఈ విషయం చెప్పడానికి తాను సిగ్గు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
World Cup: ప్రపంచ కప్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లు వచ్చేస్తున్నారు..!
ఇదే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. బీజేపీ విధానాల వల్ల రక్తపాతం వస్తోందన్నారు. బీసీ అంటే బాహుబలి కమ్యూనిటీ అని అభివర్ణించారు. బీసీలు రెండు తలకాయల పాములా ఉండిపోయామని ఆవేదన చెందారు. బీసీ జనగణన 1931 తర్వాత జరగలేదన్నారు. బీసీ జనగణన ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, కొన్ని ప్రాంతీయ పార్టీలు కుల గణన జరగాలని చెప్తున్నాయన్నారు. మండలి కమిషన్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు.
Alla Nani: పవన్, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా.. సీఎం జగన్‌ను ఏమి చేయలేరు