Delhi: దేశంలో ప్రతీ రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. చాలా సందర్భాల్లో తెలిసిన వారి నుంచి బాలికలు, మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కు తేడా తెలియకపోవడంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చాలా సందర్భాల్లో పరువు కారణంగా కొన్ని కేసులు బయటకు రావడం లేదు. మరోవైపు అత్యాచారాలు, లైంగిక నేరాలకు ప్రభుత్వాలు నిర్భయ, పోక్సో వంటి చట్టాలను తీసుకుని వచ్చినా.. అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు.…
బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవిత కాల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. సెక్షన్ 305 కింద జీవితకాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పోక్సో యాక్ట్ 9,10 సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
తనతో శృంగారంలో పాల్గొనమని బలవంతం చేసి ఓ వ్యక్తిని ఓ బాలుడు హత్యచేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని హతమార్చినందుకు 16 ఏళ్ల బాలుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీలోని జసోలా మెట్రో స్టేషన్‌లో ఏప్రిల్ 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తన వద్ద శిక్షణ పొందుతున్న ముగ్గురు క్రికెటర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెట్ కోచ్ నరేంద్ర షా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. యువ క్రికెటర్లను లైంగికంగా వేధించిన కేసులో కోచ్ నరేంద్ర షాను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రాణాలతో బయటపడిన మాజీ విద్యార్థిని లైంగిక వేధింపుల ఫిర్యాదుపై అసిస్టెంట్ ప్రొఫెసర్ హరిపద్మన్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. చెన్నైలోని సాంప్రదాయ కళలను బోధించే, శాస్త్రీయ కళలకు సంబంధించిన ప్రతిష్టాత్మక సంస్థ కళాక్షేత్ర ఫౌండేషన్‌లో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆడపిల్లలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా కామాంధులు తమ పశువాంఛను తీర్చుకుంటున్నారు. పాఠశాల ఆవరణలోనే 6వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఎలాంటి లైంగిక ఉద్దేశం లేకుండా మైనర్ బాలిక వీపు, తలపై చేయి కదిలించడం ఆమె నిరాడంబరతను అతిక్రమించినట్లు కాదని, 28 ఏళ్ల యువకుడి శిక్షను రద్దు చేస్తూ బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది.
ఆడ పిల్లలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నా , పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నా రు కామాంధులు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలోని హుస్సేన్‌గంజ్‌లో ఇద్దరు బాలికలపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ఆదివారం తెలిపారు.