పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వివాదంలో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన వ్యవహారం ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తారాస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నారాయణ ఫోన్‌ను ట్యాప్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించడం.. అగ్గికి ఆజ్యం పోసినట్టయ్యింది. దీంతో.. ఫోన్ ట్యాప్ చేయడం నేరపూరిత చర్య అని, అందుకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసు రిజిష్టర్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష…