నెల్లూరులోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన బీ ఫార్మసీ విద్యార్థుల నిర్వాకం వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన బి.శ్రీకాంత్(28)కు వివాహమైంది. అయితే పెళ్లయిన ఆరునెలలకే భార్య విడిచి వెళ్లిపోయింది. దీంతో శ్రీకాంత్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒంగోలులో ఉంటున్నాడు. అతడికి విశాఖకు చెందిన మోనాలీసా అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఆరునెలల కిందట శ్రీకాంత్, మోనాలిసాలకు ఓ యాప్ ద్వారా నెల్లూరులోని…