దేశంలో పెట్రోల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.8గా నమోదైంది. అటు ఏపీలోని విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.25గా పలుకుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించడంతో వాహనదారులకు కొంత ఊరట లభించింది. అయితే త్వరలో పెట్రోల్ ధరలు మరింత తగ్గుతాయని ప్రచారం జరుగుతోంది. అది ఎలా అంటే పెట్రోల్‌ను కేంద్ర ప్రభుత్వం…
గత మూడు వారాలుగా నిలకడగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 121.28 డాలర్లకు పెరిగింది. గత పదేళ్లలో బ్యారెల్ చమురు ధర రికార్డుస్థాయిలో ఇదే అత్యధికం. ముడిచమురు ధర పెరగడం వల్ల ప్రభుత్వ రంగ చమురు కంపెనీల లాభాలపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మే 21న కేంద్ర…
వారం క్రితం భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. హైదరాబాద్‌లో సోమవారం నాడు లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు పెరిగి రూ.109.83కి చేరింది. లీటర్ డీజిల్ 16 పైసలు పెరిగి రూ.97.98కి చేరింది. మరోవైపు ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 11 పైసలు తగ్గి రూ.111.92గా నమోదైంది. లీటర్ డీజిల్ 9 పైసలు తగ్గి రూ.99.65కి చేరింది. Credit Card: డెబిట్ కార్డ్ కంటే క్రెడిట్ కార్డ్ ఉత్తమమా..? కాగా 10…
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంపై ప్రధాని మోదీ స్పందించారు. పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ పౌరులకు మరింత ఉపశమనం కలగడంతో పాటు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ప్రజలే మొదటి ప్రధాన్యత అని మోదీ వెల్లడించారు. దేశంలో ఉజ్వల యోజన పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు లాభపడుతున్నాయని…
కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరల్లో మార్పు చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చాలా రోజుల తర్వాత మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు, లీటర్ డీజిల్‌పై 16 పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.66కి చేరింది. అటు లీటర్ డీజిల్ రూ.105.65కి ఎగబాకింది. New Rule: అలర్ట్.. పాన్ కార్డు వాడే వారికి కొత్త రూల్ అయితే దేశ రాజధాని ఢిల్లీలో…
కరోనా పరిస్థితులపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పెట్రోల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని మోదీ ఆరోపించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినా.. రాష్ట్రాలు తగ్గించలేదన్నారు. రాష్ట్రాల తీరు వల్లే ధరలు పెరుగుతున్నాయని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాలని.. అప్పుడే ప్రజలపై పెట్రోల్ ధరల…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిపిందు. అయితే ప్రస్తుతం ముడి చమురు ధరలు కాస్త కిందకు దిగొచ్చాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం ఇంకా ముగియకున్నా.. చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ముడి చమురు దరలు మాత్రం తగ్గడం విశేషం. చైనా నుంచి డిమాండ్ తగ్గడంతో బ్యారెల్‌పై 3.12 శాతం మేర ధర తగ్గింది. దీంతో ప్రస్తుతం బ్యారెల్ ధర 99.67 డాలర్లుగా ఉంది.…
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇది కొంచెం వాహనదారులకు ఊరట ఇచ్చే అంశమే. అయినా గత 16 రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.10 పెరిగింది. దీంతో వాహనదారులపై పెనుభారం పడింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర ఇప్పటికే రూ.120 దాటింది. మరోవైపు డీజిల్ ధర రూ.107కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను…
ఉగాది పర్వదినం రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు శాంతించలేదు. పండగ వేళ అని కూడా చూడకుండా వాహనదారులకు చమురు కంపెనీలు వాహనదారులకు షాకిచ్చాయి. పెట్రోల్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ 80 పైసల చొప్పున పెరిగాయి. గత 12 రోజుల్లో పెట్రోల్ రేట్లను పెంచడం ఇది పదో సారి. 12 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.7.20 చొప్పున పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో…
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రభావం చమురు ధరలపై విపరీతంగా చూపిస్తోంది. ఫలితంగా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా శ్రీలంకలో చమురు ధరలను పెంచుతున్నట్లు ఎల్‌ఐవోసీ ప్రకటించింది. ఈ మేరకు లీటర్ పెట్రోల్ ధర రూ.50, లీటర్ డీజిల్ ధర రూ.75 పెంచుతున్నట్లు తెలిపింది. ధరలను పెంచిన అనంతరం లీటర్ పెట్రోల్ ధర రూ.254కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.214కి చేరింది. మరోవైపు శ్రీలంక రూపాయి భారీగా పతనమైంది. ఈ…