నగరంలో కుక్కకాటు ఘటనలను అరికట్టేందుకు నోయిడా అథారిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం పెట్ పాలసీకి సవరణలు చేసింది.పెంపుడు కుక్క లేదా పిల్లి ఎవరిపైనైనా దాడి చేస్తే వాటి యజమానులకు రూ.10వేల జరిమానా విధించాలని నోయిడా అథారిటీ సీఈఓ రీతు మహేశ్వరి నిర్ణయించారు.