Telangana : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌గా ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం క్లియర్ చేసింది. మొత్తంగా రూ.180.38 కోట్ల బిల్లులు విడుదల చేయడం ద్వారా దాదాపు 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల…
ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్దారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి నెలలా కాకుండా.. సెప్టెంబర్ నెలలో ముందుగానే పెన్షన్ ఇవ్వనుంది. ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం.. ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
AP CM: రాష్ట్రంలోని పెన్షన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటమే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.. అందరి మద్దతుతో అండగా నిలుస్తూ.. సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది.. ఏ ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు ఓట్లేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ, ప్రథమ కర్తవ్యం.. మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ను ఒకేసారి రూ. 1000 పెంచాం.
కేంద్ర బడ్జెట్ అంటేనే అందరికీ గంపెడాశలుంటాయి. పైగా త్వరలోనే దేశ వ్యాప్తంగా ఓట్ల జాతర జరగబోతుంది. దీంతో బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా వరాలు ప్రకటించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా మోడీ సర్కార్ మరోసారి వచ్చేందుకు బడ్జెట్‌ను ఒక అస్త్రంగా ఉపయోగించుకోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పెన్షనర్లు, కేంద్ర ఉద్యోగులైతే ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరీ నిర్మలాసీతారామన్ ఎలాంటి వరాలు కురిపిస్తారోనని అందరూ ఎదురుచూస్తు్న్నారు.
Life Certificate For Pensioners: జబ్బుపడిన, ఆసుపత్రిలో చేరిన పింఛనుదారులకు లైఫ్ సర్టిఫికేట్‌లను సమర్పించడంలో సహాయపడటానికి 'డోర్‌స్టెప్ ఎగ్జిక్యూటివ్‌లను' పంపడానికి ఏర్పాట్లు చేయాలని పెన్షన్ పంపిణీ చేసే అన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తన కోటి మందికి పైగా ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యాన్ని (డీఏ) మూడు శాతం పాయింట్లు పెంచి ప్రస్తుతం ఉన్న 42 శాతం నుంచి 45 శాతానికి పెంచే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రం అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు దశ కు చేరుకున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కు మరియు పింఛనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులను కూడా జారీ చేసింది.జీవోలో ఈ విధంగా పేర్కొన్నది.ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ దాదాపు 30శాతం పెంచింది. బదిలీ పై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ను 30శాతం పెంచింది. సెలవు రోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు అలాగే…
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్రంలోని మోదీ సర్కారు ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.