7th Pay Commission: రైతుల కోసం పిఎం కిసాన్ యోజన విడతను ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల విడుదల చేశారు. కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ అయింది. ఇదిలా ఉండగా కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఉద్యోగులకు కరువు భత్యంలో 4 శాతం పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఏడో వేతన సంఘం కింద ఏడాదికి రెండుసార్లు డీఏ పెరుగుతుంది. డియర్‌నెస్ అలవెన్స్‌లో పెంపుదల మొదటిసారి జనవరిలో… మళ్లీ 6 నెలల తర్వాత జూలైలో ప్రకటిస్తారు. ఈ ఏడాది జులైలో పెంపుదల ఇంకా ప్రకటించలేదు, అయితే ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఏడవ వేతన సంఘం కింద పెరిగే డియర్‌నెస్ అలవెన్స్ శాతం AICPI డేటాపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం, 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెరగనుంది. మరోవైపు, జూలై 31న, జూన్ నెల AICPI ఇండెక్స్ డేటా విడుదల కానుంది. ఈ డేటా విడుదల తర్వాత డీఏ ఎంత శాతం పెరుగుతుందో నిర్ణయించబడుతుంది.
4 శాతం డియర్‌నెస్ అలవెన్స్
ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 4 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నివేదికల్లో పేర్కొంది. కరువు భత్యాన్ని నాలుగు శాతం పెంచితే, ఉద్యోగుల డీఏ 46 శాతానికి పెరుగుతుంది. DR లో అదే పెరుగుదల అంచనా వేయబడింది. ఉద్యోగులకు డిఎ, పింఛనుదారులకు డిఆర్ ఇస్తారు.
Read Also:ITR Benefits: మీకు సాలరీ వస్తుందా.. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు రూ.50వేల ప్రయోజనం పొందుతారు
డీఏ, డీఆర్‌లలో చాలా పెంపుదల
దేశంలోని 1.75 కోట్ల మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ, డీఆర్‌లను పెంచి బహుమతిగా ఇవ్వవచ్చు. 46% డియర్‌నెస్ అలవెన్స్‌తో జీతంలో విపరీతమైన పెరుగుదల ఆశించబడుతుంది. దీని ప్రకారం కేంద్ర ఉద్యోగుల వేతనం రూ.8000 నుంచి రూ.27 వేలకు పెరగవచ్చు.