Breaking News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. జీవో Ms. No 66 ద్వారా ఉద్యోగులకు DA, G.O. Ms. No. 67 ద్వారా పెన్షనర్లకు DR 2.73 శాతం మంజూరు చేశారు. ఈ కొత్త డీఏను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి ఇవ్వనున్నారు.. జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను సెప్టెంబర్, డిసెంబర్ మరియు మార్చి నెలల్లో 3 సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు. ఈ కొత్త డీఏతో కలిపి ఉద్యోగుల మొత్తం డీఏ 22.75 శాతం అవుతుంది. ఇక, ఈ సందర్భంగా.. డీఏ మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు నేతలు.. కాగా, గత కొన్ని రోజులుగా.. ప్రభుత్వం ఉద్యోగుల మధ్య వివిడ డిమాండ్లపై చర్చలు సాగుతోన్న విషయం విదితమే..
Read Also: MLA Chennakesava Reddy: లోకేష్‌కి ఇదే నా సవాల్.. నాపై పోటీచేసి గెలిస్తే రాజకీయాలకు గుడ్‌బై..