‘విజయమే లక్ష్యంగా 26 డివిజన్లలోనూ టిడిపి కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయాలి. పనిచేయకుండా ఫలితం ఎవరికీ దక్కదు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత మాది.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.
గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్‌ను బరిలోకి దిగిన విషయం విదితమే.. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన.. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ నుంచి కూడా అపూర్వ స్వాగతం లభిస్తోంది..
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గుంటూరు జిల్లా తెలుగు యువత క్యాడర్‌తో గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత కదిలితే ప్రభుత్వాలు మారతాయని.. అదే యువత రగిలితే ప్రభుత్వాలు కుప్పకూలుతాయని అన్నారు.