మరావతి వ్యవహారాల్లో మున్సిపల్ మంత్రి నారాయణ పాత్ర పరిమితం కాబోతోందా? అన్ని వ్యవహారాలను డీల్ చేయడం ఆయనవల్ల కావడం లేదా? అందుకే కేంద్ర మంత్రి తెర మీదికి వచ్చారా? ఆ విషయమై జరుగుతున్న చర్చలేంటి? మున్సిపల్ మినిస్టర్‌కు ఎక్కడ తేడా కొట్టింది? అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ వేసింది ఏపీ సర్కార్. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. సమస్య పరిష్కారం సంగతి…
గుంటూరు గొంతు ఎండకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉందని.. ఏడాదిలోపు నిధులు సేకరించి పనులు ప్రారంభిస్తామని.. గుంటూరు ప్రజలకు నీళ్లు అందిస్తామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. గుంటూరు నగరంలో భాగమైన గోరంట్లలో కొన్నేళ్లుగా ఆగిపోయిన రిజర్వాయర్ నిర్మాణాలను తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులైన నసీర్ అహ్మద్, పిడుగురాళ్ల మాధవి, బూర్ల రామాంజనేయులుతో కలిసి పెమ్మసాని శనివారం పరిశీలించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్ ద్వారా ప్రజలకు మేలు చేసే బాధ్యత మాదేనని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్‌లో సుమారు 200 మంది వైసీపీ నాయకులు శనివారం టీడీపీలో చేరారు.
టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చిన వాళ్లం విజయవాడ నుంచి తెనాలికి మాత్రం రాలేమన్నారు. గోతులతో నిండిన ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాంతకంగా ఉందని ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు.
అధికార వైసీపీ పార్టీపై గుంటూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. ఉన్మాదికి అధికారం ఇస్తే ఎలాంటి విధ్వంసం జరుగుతుందనేందుకు అమరావతి ప్రత్యక్ష ఉదాహరణ అని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని ప్రాంతంలో ఆయన ఇవాళ పర్యటించి అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను, జరిగిన విధ్వంసాన్ని పరిశీలించారు. ఉద్దండరాయినిపాలెంలో అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతం, ప్రజాప్రతినిధులు అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలు, సెక్రటేరియట్ కాంప్లెక్స్, అంబేద్కర్ స్మృతివనం ప్రాంతాలను…
అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని అమరావతిలో కట్టడాలను పలువురు నేతలతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు.
‘ఎవరైనా సరే ఒక వ్యక్తికి నమస్కారం పెట్టే స్థాయి నుంచి, మరో 10 మందికి స్ఫూర్తిగా ఎదిగే స్తాయికి ఎదగాలి. ప్రభుత్వం అనేది సంక్షేమం అందజేసి చేతులు దులుపుకోకూడదు, స్వయంగా సంపాదించుకునేలా ఉపాధి అవకాశం కల్పించాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.