నేడు దర్శకేంద్రుడుగా జేజేలు అందుకుంటున్న కె.రాఘవేంద్రరావు తెరపై చేసిన చిత్రవిచిత్ర ఇంద్రజాలాన్ని ఎవరూ మరచిపోలేరు. తొలి చిత్రం ‘బాబు’ మొదలుకొని మొన్నటి ‘ఓం నమో వేంకటేశాయ’ వరకు రాఘవేంద్రుని చిత్రాల్లోని పాటలు పరవశింప చేశాయి. పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుని జాలమే ఆయనను దర్శకేంద్రునిగా నిలిపిందని చెప్పవచ్చు. ‘అన్నమయ్య’ చిత్రం తీసి జనాన్ని మెప్పించిన రాఘవేంద్రుడు ఆ కవిపుంగవునిలాగే ఓ వైపు శృంగారాన్ని, మరోవైపు ఆధ్యాత్మికతను ప్రదర్శించారనిపిస్తుంది. కోవెలముడి రాఘవేంద్రరావు 1942 మే 23న జన్మించారు. ఆయన తండ్రి…
స్టార్ పిల్లలు సినిమా పరిశ్రమలోకి సులభంగా ప్రవేశిస్తారనే టాక్ ఇప్పటికీ ఉంది. అయితే ఎంట్రీ సులభమే అయినప్పటికీ, ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. చాలా మంది స్టార్ కిడ్స్ తమ తల్లిదండ్రులలాగా స్టార్స్ అవ్వకపోవడానికి కారణం ఇదే. నిర్మలా కాన్వెంట్, పెళ్లిసందడి వంటి సినిమాలతో బాలనటుడిగా, హీరోగా రెండు సార్లు టాలీవుడ్ రంగప్రవేశం చేసిన సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే తాజాగా ఈ…
ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ‘ పెళ్లి సందడి’ సినిమాతో నటుడుగా పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తున్నాడు. రోషన్, శ్రీ లీల ప్రధాన పాత్రలలో నటించిన ఈ రొమాంటిక్ డ్రామా 15 వ తేదీన విడుదల కానుంది. గౌరీ రోనంకి దర్శకత్వం వహించారు. కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ నిజానికి ‘శతమానంభవతి’తోనే రాఘవేంద్రరావును పూర్తి స్థాయి నటుడిగా పరిచయం చేయాలనుకున్నామని,…
‘పెళ్లిసందడి’ చిత్రానికి సీక్వెల్ గా ‘పెళ్లి సందD’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ‘పెళ్లి సందడి’కి…
ఏప్రిల్28! దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు జీవితంలో విశిష్టమైన రోజు. ఎందుకంటే ఏప్రిల్28 కమర్షియల్ సినిమాకి కొత్త భాష్యం చెప్పి బాక్సాఫీస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన, కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అడివిరాముడు రిలీజైన రోజు. అదే ఏప్రిల్ 28 ప్రపంచ చలన చిత్ర చరిత్రలో సంచలనం సృష్టించి బాక్సాఫీస్ రికార్డులకు కొత్త అర్ధం చెప్పిన కె. రాఘవేంద్రరావు సమర్పణలో ఆయన శిష్యుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2 విడుదలైన రోజు. అంతేకాదు… అదే తేదిన…