అచ్చి వచ్చిన రోజున దర్శకేంద్రుని చిత్ర గీతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్28! దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు జీవితంలో విశిష్టమైన రోజు. ఎందుకంటే ఏప్రిల్28 కమర్షియల్ సినిమాకి కొత్త భాష్యం చెప్పి బాక్సాఫీస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన, కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అడివిరాముడు రిలీజైన రోజు. అదే ఏప్రిల్ 28 ప్రపంచ చలన చిత్ర చరిత్రలో సంచలనం సృష్టించి బాక్సాఫీస్ రికార్డులకు కొత్త అర్ధం చెప్పిన కె. రాఘవేంద్రరావు సమర్పణలో ఆయన శిష్యుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2 విడుదలైన రోజు. అంతేకాదు… అదే తేదిన రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్. ప్రకాశరావు డైరెక్ట్ చేసిన ‘సెక్రటరీ’ మూవీ సైతం విడుదలైంది. ఆ రకంగా ఇది రాఘవేంద్రరావుకు మెమొరబుల్ డేట్. అలానే ఆయన కెరీర్ లో మ్యూజికల్ హిట్ గా నిలిచిన ‘పెళ్ళిసందడి’ విడుదలై ఇప్పటికీ పాతికేళ్ళు గడిచింది. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ తరం, కొత్త జంటతో ‘పెళ్ళి సందడి’ మరోమారు తెరకెక్కుతోంది. అయితే… ఇది ఆ సినిమాకు సీక్వెల్ కాదు, ఆ కథ అస్సలు కాదు. ఇది ఈ తరం ప్రేమకథ, పెళ్ళి కథ. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఈ మూవీలోని తొలి గీతం ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల కాబోతోంది. గౌరీ రోనంకి దర్శకత్వంలో అర్కా మీడియా వర్క్, ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!