NTR 30: శ్రీలీలకు గోల్డెన్ ఛాన్స్.. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకు ఫిక్స్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreeleela : ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో సినిమా రాబోతున్నదని టాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోంది. కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి సినిమా ఎనౌన్స్ మెంట్ లేదు. కొరటాల సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకున్న ఎందుకనో ఇంకా అది ప్రారంభం కాలేదు. ఆచార్య ఫ్లాప్ కారణంగా కొరటాల ఎన్టీఆర్ కోసం అనుకున్న స్క్రిప్ట్ పై మళ్లీ రీవర్క్ చేస్తున్నారు. యూనివర్శల్ అప్పీల్ తీసుకురావడానికి కసరత్తులు జరుగుతున్నాయి. మరో వైపు క్యాస్టింగ్ సెలక్షన్ కూడా ఇంకా పూర్తిగా జరగలేదు. హీరోయిన్ ని కూడా ఖరారు చేయలేదనే మాట వినిపిస్తుంది.
Read Also:Ginna : జిన్నా సినిమా ప్రీ రిలీజ్ రేపే..
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
కాకాపోతే హీరోయిన్ గా బాలీవుడ్ భామల్ని తీసుకోవాలని ప్రయత్నించారు. రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక రష్మిక, కీర్తి సురేష్ ని సంప్రదించినట్లు తెలిసింది. వీరిలో రష్మిక మందన హీరోయిన్ గా ఖరారైపోయింది అనే ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు తెరపైకి మరో యంగ్ హీరోయిన్ పేరు వచ్చింది. తారక్‌కు జోడీగా పెళ్లి సందడి ఫేం శ్రీలీలని ఖరారు చేశారనే మాట వినిపిస్తుంది. ఇప్పటికే శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. చేతిలో ఏకంగా ఏడు సినిమాల వరకు ఉన్నాయి. ఇక రామ్, బోయపాటి సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్.
Read Also: Priya Warrior : ఆ హీరో అంటే క్రష్.. మనసులో మాట బయటపెట్టిన హీరోయిన్
ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం శ్రీలీలని ఎంపిక చేశారనే మాట తెరపైకి రావడంతో ఈ బ్యూటీ క్రేజ్ పై అందరూ షాక్ అవుతున్నారు. కేవలం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి ఇన్ని వరుస అవకాశాలని ఎలా అందుకుంటుందంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆమెకి ఇలా భారీ ఆఫర్స్ రావడం వెనుక రాఘవేంద్రరావు హస్తం ఉందనే మాట వినిపిస్తుంది. ఒక వేళ తారక్ కి జోడీగా నిజంగా శ్రీలీలకి అవకాశం వస్తే మాత్రం అది ఆమె కెరియర్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!