Bomma Mahesh Kumar Goud: నేడు పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ
- తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు..
- పీసీసీ చీఫ్‌గా ప్రమాణస్వీకారం సందర్భంగా గాంధీభవన్‌ను ముస్తాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomma Mahesh Kumar Goud: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్క్‌కు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్‌కు చేరుకుంటారు. గాంధీభవన్‌లో ఆయనకు కేటాయించిన రాష్ట్రపతి ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత 2.45 గంటలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ గా మహేశ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఇందిరాభవన్ ఎదుట బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పీసీసీ చీఫ్‌గా ప్రమాణస్వీకారం సందర్భంగా గాంధీభవన్‌ను ముస్తాబు చేశారు. బాధ్యతల అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. పూజల అనంతరం గాంధీభవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వేదికలో యాభై నుంచి అరవై మంది వరకు కూర్చోవచ్చు. వేదికపై 500 మంది వరకు ముఖ్యనేతలు కూర్చునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Read also: Flood Flow Reduced: ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గుతున్న గోదావరి వరద..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
అన్ని రంగులు వేయించి, కొత్త ఫర్నిచర్ వేయించి గాంధీభవన్‌ను ఏర్పాటు చేశారు. గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. శనివారం మధ్యాహ్నం సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గాంధీభవన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహేశ్‌కుమార్‌గౌడ్ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానని గుర్తు చేశారు. పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్‌కు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో దాదాపు రెండు గంటలపాటు బస చేయనున్న నేపథ్యంలో పోలీసులు శనివారం సాయంత్రం నుంచి దాని పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
Kerala: షాకింగ్ న్యూస్.. ఇడ్లీలు తింటూ వ్యక్తి మృతి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!