CM Chandrababu: అడవీ మార్గం గుండా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దు అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ సీఎస్ కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అడవీ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు.
బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి బరువు 25 వేల 1 రూపాయి నాణేలు కార్మికుల సమావేశంలో పాల్గొనేందుకు బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ దర్భంగా చేరుకున్నారు. ఈ సమయంలో కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ అతనికి మిథిల సంప్రదాయం ప్రకారం తలపాగా, దుప్పటి ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర అధ్యక్షుడి ఈ సందర్శనను తనకు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. తనకు ఒక రూపాయి నాణెలతో త్రాసుపై తూకం వేశారు.…
జనసేన తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్‌పై ఓ మహిళ కోటి ఇరవై డబ్బులు ఇవ్వాలంటూ ఆరోపణలు చేయడం, వీడియోలు బయటకు రావడం సంచలన రేపాయి.2013 లో తీసుకున్న డబ్బులు ఎప్పుడో తిరిగి ఇచ్చేశానని కాని ఇచ్చేసిన డబ్బులను, మార్ఫింగ్ వీడియోలతో వైసీపీ నేతలు ఆ మహిళతో కలసి కుట్ర పన్ని ఇలా చేస్తున్నారంటూ తిరుపతి పోలీసులు కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు..
వర్మ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా మరో ట్వీట్ చేశారు.. ఒంగోలు పోలీస్ స్టేషన్ లో నిన్న విచారణ పూర్తయిన అనంతరం ఎక్స్ లో స్పందించిన ఆర్జీవీ.. ''ఐ లవ్ ఒంగోలు.. ఐ లవ్ ఒంగోలు పోలీస్.. ఈవెన్ మోర్.. 3 ఛీర్స్...'' అంటూ రాసుకొచ్చిన వర్మ.. పెగ్గుతో ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశారు..
మంచిని మైకులో చెప్పు, చెడును చెవిలో చెప్పు అంటారు. కానీ.... ఏపీలో మాత్రం మంచో చెడో తెలియదుగానీ.... మొత్తం మైకులో చెప్పేశారు. ఇప్పుడిదే రాష్ట్రంలో చర్చోప చర్చలకు కారణం అవుతోంది. తనతో సహా... మంత్రివర్గ సహచరులందరికీ ర్యాంక్స్ ఇచ్చేశారు సీఎం చంద్రబాబు. వాటి చుట్టూనే ఇప్పుడు కొత్త ప్రశ్నలు, అనుమానాలు రేగుతున్నాయట. సాధారణంగా చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే... ర్యాంకులు...గ్రేడ్లు....అంటూ రకరకాల తూనికలు-కొలతలు ఉంటాయి.
వివాదాస్పద పోస్టులతో కేసులు ఎదుర్కొంటున్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సీఐ శ్రీకాంత్‌బాబు నేతృత్వంలోని టీమ్.. ఆర్జీవిని ప్రశ్నిస్తున్నారు.. అయితే, ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో దాదాపు ఆరు గంటలుగా ఆర్జీవీ విచారణ కొనసాగుతోంది.. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు ఆర్జీవీ.. అయితే, తన ఎక్స్ లో నుండే ఆ పోస్టింగ్స్…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.. అసెంబ్లీ సమావేశాలకు కావాల్సిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం అదేశించింది.. అసెంబ్లీ సమావేశాలను 20 రోజులు పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.. మరోవైపు ఈ నెల 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సభ్యులు విధులు, సభలో సభ్యుల నడుచుకునే తీరు వంటి అంశాలపై సభ్యులకు…
ప్రశ్నకే.... ప్రశ్నలు ఎదురవుతున్నాయా? నిలదీస్తానన్న స్వరానికే నిలదీతలు పెరుగుతున్నాయా? ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ను వైసీపీ నేతలు అడుగుతున్న తీరు చూస్తుంటే... ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ప్రభుత్వంలో ఎక్కడ తప్పు జరిగినా... తేడాగా ఏం చేసినా... ప్రశ్నిస్తా, నిలదీస్తానని గతంలో స్టేట్మెంట్స్ ఇచ్చారు పవన్.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. నామినేటెడ్ పదవుల్లో 34 శాతం బీసీ లకు కేటాయించేలా కేబినెట్ ఆమోదం తెలిపింది.. తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయడంపై మంత్రులు దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు... నామినేటెడ్ పదవుల్లో 34 శాతం బీసీలకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు..
ఫైన్ల క్లియరెన్స్ విషయంలో తన కేబినెట్లో ఏ మంత్రి.. ఏ స్థానంలో ఉన్నారు అనే విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు.. డిసెంబర్ వరకూ ఫైళ్లు క్లియరెన్స్ లో మంత్రుల పనితీరు చదివి వినిపించారు.. అయితే, ఫైళ్ల క్లియరెన్స్ విసయంలో 6వ స్థానంలో తాను ఉన్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఫైళ్లు వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సూచించారు.. ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో మంత్రి ఫరూఖ్ ఉండగా.. చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.. ఇక,…