ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య.. ఉత్తర్వులు జారీ ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను నియమితులయ్యారు. అందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రవీణ్ ఆదిత్య ఏపీ మారిటైం బోర్డ్ సీఈఓగా ఉన్నారు. కాగా.. ఫైబర్ నెట్ ఎండీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత ఎండీ దినేష్ కుమార్ను జీఏడీకి అటాచ్ చేసింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. దినేష్ వైఖరిపై నిన్న జీవీ రెడ్డి రాజీనామా…
లోకేష్ కౌంటర్ ఎటాక్.. అవి మీకు అలవాటు.. మాకు కాదు..! ఏపీ శాసనమండలి వేదికగా మంత్రి నారా లోకేష్.. వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది.. వైసీపీ కామెంట్లకు కౌంటర్ ఎటాక్కు దిగారు మంత్రి నారా లోకేష్.. వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వండి, ఇప్పుడే విచారణకు ఆదేశిస్తా, అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపించాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. 19 మంది వైస్ చాన్సలర్లలో ఒకేసారి 17మంది వీసీలను బలవంతంగా…
వైసీపీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే జనసేన పార్టీలో చేరగా.. బాలినేని ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరరేందుకు సిద్ధమయ్యారు వైసీపీ కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు.. పవన్ సమక్షంలో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతో పాటు ముగ్గురు కో- ఆప్షన్ సభ్యులు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు..
చిరంజీవి తమ్ముడు అయినప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు . అలాగే నిర్మాతగానూ పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కానీ అనుకున్నంతగా లాభాలు అందుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి ఆయన పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉంటున్నారు.జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నాగ బాబు.…
శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం ఉంటుంది. ఎమ్మెల్యే కూన రవి కుమార్ సభలో ధన్యవాదాలు తీర్మానాన్ని ప్రవేశపెడతారు.. తర్వాత గవర్నర్ ప్రసంగం పై చర్చ జరుగుతుంది.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల ప్రకటన చేస్తారు సీఎం చంద్రబాబు.. ఇక, శాసన మండలిలో ఏపీ ఎంఆర్డీ సవరణ ఆర్డినెన్స్ మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరుగుతుంది.. శాసన మండలిలో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభ్యులు ప్రసంగిస్తారు.
Roja: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై అందరూ ఆతృతగా ఎదురు చూసారు.. ఆయన ప్రసంగంలో జగన్ ను తిట్టిస్తూ.. చంద్రబాబును పొగిడించుకున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.
‘కేసీఆర్’ ఇంటర్నెట్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత! మాజీ సీఎం కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్ జిరాక్స్ సెంటర్ను ఎమ్మెల్సీ కవిత సోమవారం ప్రారంభించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుడైన సతీశ్కు ఆర్థికంగా చేయూతనందించిన కవిత.. నేడు ‘కేసీఆర్’ ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్ను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మాజీ ఎంపీ మలోత్ కవిత పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.. ఇక, గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి.. హైదరాబాద్ మియాపూర్ మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. విద్యార్థిపై శారీరక దాడి చేసి అతడి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు కలిగించినట్లు తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు, ఓ ఉపాధ్యాయుడు గతంలో కూడా విద్యార్థులపై కర్రతో దాడి చేసిన ఘటనలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన విద్యార్థి తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని కలిసి ఫిర్యాదు…