MLC Nagababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఈ రోజు (ఏప్రిల్ 3న) జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలో వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అయితే, ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాగబాబుకు డిప్యూటీ సీఎం పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన కొణిదెల నాగబాబు.. ఏప్రిల్ 2వ తేదీ నాడు ప్రమాణ స్వీకారం చేశారు.
Read Also: Nara Lokesh: మంగళగిరిని దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తయారు చేస్తా..
అయితే, బుధవారం నాడు మధ్యాహ్నం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబుకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి అన్నయ్య, వదిన ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నామని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.