పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు మరో పక్క రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ కాక ముందు పలు సినిమాలు లైన్లో పెట్టారు అలా లైన్ లో పెట్టిన అన్ని సినిమాలలో పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది సుజిత్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన ఓజీ. ఈ సినిమా ఫస్ట్ డే వచ్చిన పోస్టర్ నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ముఖ్యంగా మెగా అభిమానులలో…
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాచారం ఇచ్చారు. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఇటీవల ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో…
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి కూడా.. పార్టీ ఆవిర్భావ వేడుకులకు వెళ్లాలనే నేతలు సిద్ధం అవుతున్నారు.. అందులో భాగంగా జిల్లాల నాయకులు, నియోజకవర్గం నేతలు, పార్టీ కార్యకర్తలు తరలి రావాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేమురి శంకర్ గౌడ్ కోరారు.
జనసేన పార్టీ రాష్ట్రానికి భవిష్యత్ అని ప్రజలు అనుకునే విధంగా సభ నిర్వహించాలి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు.. పవన్ వస్తున్నారంటే జనాలను తరలించాల్సిన అవసరం లేదు.. జనసేనలో చాలా మంది పదవులు కోసం ఆశిస్తున్నారు.. పదవులు కోసమే ప్రయాణం చేయకూడదు అని మంత్రి మనోహర్ సూచించారు.
డీలిమిటేషన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను సీపీఎం రాఘవులు తప్పుపట్టారు. అమిత్ షా చాలా మోసపూరితంగా మాట్లాడారన్నారు. బీజేపీ అనుకున్న రాష్ట్రాలకు మాత్రమే ఎంపీ సీట్లు పెరిగితే.. అది మోసం కాదా..? అని నిలదీశారు.
Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిని పట్టాలెక్కించే బడ్జెట్ ఇది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సంక్షేమం, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకి మార్గ నిర్దేశనం చేసేలా బడ్జెట్ ఉంది..
AP Budget 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్‌ను రూపొందించింది. ఈ బడ్జెట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రివర్గ సభ్యులు పాల్గొన్నారు. మంత్రి పయ్యావుల అసెంబ్లీలో, మంత్రి కొల్లు రవీంద్ర మండలిలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నేడు ఉదయం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
న్యాయమూర్తి ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి... తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని అంగీకరించారు పోసాని కృష్ణమురళి. తన భార్యను దూషించిన బాధతోనే తాను అలా తిట్టాల్సి వచ్చిందన్నారు. తన భార్యను దూషించిన వీడియోలు కట్ చేసి.. తాను మాట్లాడినవి మాత్రమే చూపించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారాయన.
ఇవాళ అసెంబ్లీ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఉదయం 9గంటలకు కేబినెట్ అమోదించాక.. సభలో ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ ఎలా ఉండబోతోంది. ఏపీలో అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతోంది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.