ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామానికి వెళ్లనున్నారు. కొణిదెల గ్రామంలో పవన్ తన సొంత నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలతో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కొణిదెల గ్రామ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పవన్ ఇంటి పేరు ‘కొణిదెల’ అన్న విషయం తెలిసిందే. జనసేన…
కూటమి ప్రభుత్వానికి ఏడాది గడిచింది.. హనీమూన్ పీరియడ్ ముగిసింది.. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే.. కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి.. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం.. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. అప్పుడే మనం సత్తా చూపగలం అని సూచించారు.
కూటమి ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టార్గెట్‌గా మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా.. మహిళల అక్రమ రవాణాపై ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు ఆర్కే రోజా.. ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా పవన్ కల్యాణ్... మరి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ను తొక్కిపెట్టి నార తీయాలి కదా..? అని…
కూటమి ప్రభుత్వం ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని.. కూటమి ప్రభుత్వ పాలనపై వారికి వారే డబ్బాలు కొట్టుకుంటున్నారు.. ఈ కూటమి సమావేశంలో ఈ సంవత్సర కాలం పాలన, రానున్న రోజుల్లో ఏం చేస్తారో చెప్తారని అందరూ ఊహించారు. కానీ, సొంత డబ్బా కొట్టుకోవడం, జగన్ ని తిట్టటానికే సమావేశం జరిపారని దుయ్యబట్టారు.. చంద్రబాబు 420 అబద్దాలు చెప్పగా, లోకేష్ 840 అబద్దాలు చెప్పారు... కానీ, పవన్ కల్యాణ్ కళ్లు మూసుకొని కూర్చున్నారని…
Nagababu : మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి తీవ్ర అనారోగ్యం అని.. హాస్పిటల్ లో జాయిన్ చేశారంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేబినెట్ మధ్యలో నుంచే హైదరాబాద్ వచ్చేస్తున్నాడని.. చిరంజీవి, రామ్ చరణ్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్ని వస్తున్నారంటూ ఒకటే రూమర్లు వస్తున్నాయి. తాజాగా వీటిపై నాగబాబు స్పందించారు. Read Also : Amitabh Bachchan : అందుకే ఐశ్వర్యను పొగడను.. అమితాబ్ షాకింగ్ కామెంట్స్ ‘మా తల్లి…
సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఇప్పుడు వేటిని నమ్మాలో వేటిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు విషయం ఏమిటంటే ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అయితే క్యాబినెట్ సమావేశం మధ్యలో నుంచి ఆయన బయలుదేరి హైదరాబాద్ రావడంతో ఆయన తల్లి అంజనాదేవికి అనారోగ్యం ఉందని అందుకే హుటాహుటిన ఆయన బయలుదేరి రావాల్సి వచ్చిందంటూ వార్తలు మొదలయ్యాయి. నిజానికి ఎవరికైనా ఒంట్లో బాలేదని వార్త బయటకు వస్తే ముందు…
రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై సైతం మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు.. ఈ మధ్య ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపిన రప్పా.. రప్పా వ్యాఖ్యలు కూడా ప్రస్తావనకు రాగా.. ఇటీవల వైఎస్ జగన్ పర్యటన.. కాన్వాయ్ ప్రమాదంపై చర్చించారు.. అయితే, రప్పా.. రప్పా వ్యాఖ్యల విషయంలో వైసీపీకి ఇబ్బందులు వచ్చాయని మంత్రులు అభిప్రాయపడ్డారట.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని చర్చించారట మంత్రులు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తమిళనాడు మంత్రి శేఖర్ బాబు సవాల్ విసిరారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా? అని పవన్‌ను ప్రశ్నించారు. చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయొచ్చని, తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి చూపించాలని ఛాలెంజ్ విసిరారు. ఒకవేళ తమిళనాడు ఎన్నికల్లో పవన్ గెలిస్తే.. ఎన్ని చెప్పినా వినడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి శేఖర్ బాబు తెలిపారు. జనసేనాని తాజాగా…
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ ప్రారంభం అయింది. అయితే కేబినెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశం నుంచి వెళ్లిపోయారు. తల్లి అంజనా దేవి అనారోగ్యానికి గురయ్యారన్న సమాచారంతో పవన్ వేంటనే కేబినెట్ నుంచి బయల్దేరారు. సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. Also Read: Crime News: పెందుర్తిలో పెను…
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఆయన కుమారుడు ఏ ఎం రత్నం దర్శకత్వం వహించాడు. షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ కు వాయిదాలు మీద వాయిదాలు పడుతూ మొత్తానికి ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. ఇప్పటికీ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ డీల్స్…