తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ సంజయ్ గారి ధృఢ చిత్తం, పోరాట పటిమ తెలంగాణలో ఆయనను రాజకీయ ధృడ సంకల్పం కలిగిన నేతగా నిలిపాయి.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్”. హిందీ బ్లాక్ బస్టర్ “పింక్”కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన “వకీల్ సాబ్”కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాదాపు 3 సంవత్సరాల తరువాత పవన్ ను మళ్ళీ వెండితెరపై చూడడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఫలితంగా కరోనా ఉన్నప్పటికీ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ ను షేక్…
తెలుగు అకాడెమీ పేరును మారుస్తూ ఏపీ సర్కారు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడెమీని కాస్తా.. తెలుగు సంస్కృత అకాడెమీగా మారుస్తున్నట్లుగా ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీశ్ చంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలుగు అకాడెమీ పేరు మార్చడం వల్ల ఏమిటి ప్రయోజనం? అని ప్రశ్నించారు. వీలైతే సంస్కృత భాషాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఓ అకాడెమీ ఏర్పాటు చేయాలని హితవు పలికారు.…
తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా నాయకత్వాలు, పార్టీల పాత్రలూ ప్రవేశ నిష్క్రమణలూ జరగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీటి ప్రభావం ఎలా వుంటుందనేదానిపై ఎవరి అంచనాలు వారికి వుంటాయి గాని మార్పు తథ్యం. పైగా ఇవన్నీ ఒకటి రెండు రోజుల తేడాతో జరగడం మరీ విశేషం. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీసీసీ పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. చాలా కాలం తర్వాత గాంధీ భవన్ కళకళలాడింది. ఆ మరుసటి రోజునే వైఎస్ జయంతి…
వైఎస్ షర్మిల కొత్తపార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణలో షర్మిల పార్టీకి స్వాగతమని చెప్పిన పవన్ కల్యాణ్… ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాలన్నారు. ప్రజలకు మంచి చేయడానికి ఎవరొచ్చినా స్వాగతించాలని… 2007 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నానని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. read also : టీఆర్ఎస్లోకి ఎల్. రమణ..కాసేపట్లో కేసీఆర్తో భేటీ తెలంగాణ ఉద్యమ గడ్డ అని పేర్కొన్న పవన్ కల్యాణ్… కొత్త రక్తం, చైతన్యవంతమైన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జనసేన…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం హీట్ పెంచుతోంది… ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, రెండు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో జల వివాదంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అమరావతిలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్న పవన్.. ఇద్దరు…
ఆంధ్రప్రదేశ్లో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అందులో భాగంగా జనసేన పార్టీ కమిటీలను ప్రకటించారు. ఐదుగురిని ప్రధాన కార్యదర్శులుగా.. 17 మందిని కార్యదర్శులుగా.. 13 మందిని సంయుక్త కార్యదర్శులుగా నియమించారు.. ఇక, 9 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను కూడా ప్రకటించారు జనసేనాని.. మరోవైపు.. ఐటీ, డాక్టర్స్, చేనేత, మత్స్యకారులు, లీగల్ విభాగాలను ఏర్పాటు చేసి.. వాటికి అధ్యక్షులను నియమించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లను పరిశీలిస్తే.. కృష్ణా జిల్లా –…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతి వెళ్తున్నారు. ఆరు నెలల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో నేరుగా ఆయన పాల్గొననున్నారు. ఏపీలో ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై కూడా పవన్ నేడు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో భేటీ కానున్నారు. ఆ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నగరానికి మూడు రోజుల క్రితమే వచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్, పన్నుల పెంపు, కృష్ణాజలాల వివాదాలపై పవన్ భేటీ అనంతరం స్పందించే అవకాశాలు ఉన్నాయి.…
మలయాళ హిట్ మూవీ “అయ్యప్పనుమ్ కోషియమ్” చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ మల్టీస్టారర్ లో పవన్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన మొదటిసారిగా నిత్యామీనన్ హీరోయిన్ గా నటించనుంది. సీతారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. Read Also : అందాల విందుతో కవ్విస్తున్న…