ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఫొటో ఇప్పుడు చర్చగా మారింది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి అమర్నాథ్ రెడ్డి కలిసి ఉన్న ఫొటో.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే, పవన్‌పై అమర్నాథ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. ఇది నెట్టింట్లో ప్రత్యక్షమై తెగ తిరిగేస్తోంది.. ఇక, మంత్రిపై అమర్నాథ్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.. పవన్‌పై ఇంతలా విరుచుకుపడే నీవు.. ఆయనతో కలిసి ఫొటో ఎందుకు తీయించుకున్నావు అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ మూవీ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో వేసిన సెట్స్ లో జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా కోసం జాతీయ అవార్డు గ్రహీత, పద్మశ్రీ తోట తరణి వేసిన సెట్స్ ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చూసి, ఆయన్ని ఆత్మీయంగా సత్కరించారు. అలానే ఆ సెట్స్ లో చిత్రీకరించే పోరాట సన్నివేశాలకు సంబంధించిన ప్రిపరేషన్ లోనూ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇప్పుడు…
‘ఆచార్య’తో తమ అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు, నటుడు రామ్ చరణ్ రెడీగా ఉన్నారు. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 29న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ‘ఆచార్య’ టీం ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. మెగా పవర్‌స్టార్ తాజా ప్రెస్ మీట్…
కౌలు రైతుల విషయంలో వైసీపీ సర్కారుపై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ రైతుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. కౌలు రైతులకు ఈ ప్రభుత్వం చేసిన ప్రయోజనం ఇంతవరకు ఏ ప్రభుత్వమూ చేయలేదని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. కానీ ఇవేవీ పవన్ కళ్యాణ్‌కు కనిపించకపోవడం మన దౌర్భాగ్యం అన్నారు. చంద్రబాబు కోసమే ఉద్భవించిన రాజకీయ పార్టీ జనసేన అని.. పవన్…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. సినిమాల్లో నటించడం, కోట్లు సంపాదించడం మినహా పవన్ కళ్యాణ్‌కు వ్యవసాయం అంటే తెలియదని ఎద్దేవా చేశారు. అన్నీ పాములు ఆడితే ఏలిక పాము కూడా లేచి ఆడిందన్న చందంగా పవన్ కళ్యాణ్ వ్యవసాయం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచే అర్హత కూడా పవన్…
బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ పేరు చిత్ర పరిశ్రమలో మారుమ్రోగిపోతుంది. కెజిఎఫ్ 2 చిత్రంలో ప్రధానమంత్రి రమికా సేన్ గా అమ్మడి నటన అద్భుతం.. ఈ సినిమాతో ఒక్కసారిగా రవీనా మరోసారి అందరి దృష్టిలో పడింది. తెలుగులో ‘బంగారు బుల్లోడు, రథసారథి, ఆకాశవీధిలో’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఇన్నాళ్లకు కెజిఎఫ్ 2 చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక దీంతో టాలీవుడ్ లో అమ్మడికి వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇక సినిమాలోనైనా.. రాజకీయాలల్లోనైనా పవన్ వ్యక్తిత్వం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ప్రస్తుతం పవన్ వ్యక్తిత్వం మరోసారి బయటపడింది. జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో “జనసేన కౌలు రైతు భరోసా యాత్ర” లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక పవన్ రావడంతో జనసైనికులతో పశ్చిమగోదావరి జిల్లా నిండిపోయింది . పవన్ ను చూడడానికి అభిమానులు…
నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. తొలుత హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న పవన్ కళ్యాణ్ అనంతరం రోడ్డు మార్గంలో కలపర్రు టోల్‌గేటు మీదుగా జానంపేట, అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా విజయరాయి, పెదవేగి, ధర్మాజీగూడెం, లింగపాలెంకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి మళ్లీ ధర్మాజీగూడెం మీదుగా చింతలపూడికి వెళ్తారు. చింతలపూడికి చేరుకునే మధ్యలో పలు గ్రామాల్లో కొందరు కౌలు రైతుల కుటుంబాలను…
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం ఘటన కలకలం సృష్టిస్తోంది.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు.. అయితే, విజయవాడ జీజీహెచ్ లో సామూహిక అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్న ఆయన.. అలాగే దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో కూడా ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు..…
సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవడం ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా? అంటూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎవరి ఒత్తిడితో ప్రయాణికులను దింపి మరీ వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలి.. అని డిమాండ్ చేసిన ఆయన.. సీఎం జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణికులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకునే…