కర్నూలులో రైతు భరోసా యాత్రలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గుప్పించిన విమర్శలకు గాను, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆయనపై ధ్వజమెత్తారు. దమ్ముంటే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని పవన్‌కి సవాల్ విసిరారు. కర్నూలు పాతబస్తీలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన హఫీజ్ ఖాన్.. రెండు చోట్ల పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూసిన పవన్‌కు ప్రజా సంక్షేమ పాలనపై విమర్శించే అర్హత లేదన్నారు. కేవలం తన ఉనికిని…
కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుడు మరణించడంతో దశదిన కర్మలో భాగంగా అంగడి దింపుడు కార్యక్రమానికి ఎల్లారెడ్డి పట్టణం సంతకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంతో పాటు మరో 14మంది గాయపడ్డారు.…
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పొత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నప్పటికీ, ఏయే పార్టీలు ఎవరెవరితో చేతులు కలపనున్నాయన్న అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీ నేతలందరూ దీనిపై స్పందిస్తున్నారు. తాజాగ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ విషయంపై స్పందించారు. పొత్తుల విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని, జనసేనతో పొత్తు కొనసాగుతోందని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే.. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందా? లేదా?…
ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం వుంది. పార్టీలు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సి వుందని, అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు. ఎన్నికలకు ముందే పొత్తుల కోసం రెడీ అవుతున్నాయి. వైసీపీ నేతలు అంచనా వేస్తున్నట్లుగా టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయటం ఖాయమనే సంకేతాలు వున్నాయి. పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లా పర్యటనలో…
ఏపీలో పొత్తులపై రాజకీయాలు వేడెక్కాయి. జనసేన, టీడీపీ పొత్తు అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు ఎన్నికలంటే భయపడుతున్నారని.. కానీ ఎన్నికలంటే భయపడాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. గడిచిన మూడేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. టీడీపీ హయాంలో టీడీపీ చేసిందేమీ లేదు కాబట్టే తనతో పొత్తు పెట్టుకోవాలని అందరి కాళ్ల, వేళ్ల మీద చంద్రబాబు…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ మధ్య మొదట్నుంచి అక్రమ పొత్తులున్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు కూటమికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ రాజకీయ వ్యభిచారి అని.. బీజేపీ పక్కన ఉంటూ చంద్రబాబుకు సిగ్నల్ ఇస్తుంటే ఏం అంటారని జోగి రమేష్ ప్రశ్నించారు. టీడీపీ, జనసేన పొత్తుతో తమకు పోయేదేమీ లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎవరి వల్ల అందుతున్నాయో ప్రజలకు తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు…
‘మదర్స్ డే’ని పురష్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి భూమ్మీద ఉండే అమ్మలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో తన తల్లి అంజనా దేవి, పవన్ కళ్యాణ్, నాగబాబులతో కలిసి ఉన్న ఒక వీడియోని షేర్ చేశారు. గతంలో ఓసారి గాడ్‌ఫాదర్, భీమ్లా నాయక్ చిత్రీకరణలు ఒకేసారి జరిగాయి. ఆ సమయంలో అంజనా దేవి, నాగబాబు లొకేషన్‌కు చేరుకొని.. సెట్లో కాసేపు గడిపారు. అందరూ కలిసి సెట్లోనే భోజనం చేశారు. చూడ్డానికి ఎంతో చూడమచ్చటగా ఉండే ఈ వీడియోను అందరినీ…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. అక్కడినుంచి రోడ్డు మార్గంలో సిరువెళ్ల వెళ్లనున్నారు పవన్. మార్గ మధ్యంలో పలుచోట్ల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. నంద్యాలలోను పవన్ కళ్యాణ్ పర్యటన వుంటుందని జనసేన వర్గాలు తెలిపాయి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులతో సిరువెళ్లలో 2.30 గంటలకు ముఖాముఖి వుంటుంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం…
టీడీపీ, జనసేన పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.. సింగిల్ గా పోటే చేసే దమ్ము లేకే చంద్రబాబు పొత్తుల ఎత్తులు వేస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. జగన్ ప్రభుత్వాన్ని ఎంతమంది కట్ట కట్టుకుని వచ్చినా దించలేరనే ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సవాల్‌పై స్పందించిన అంబటి… విద్యుత్ చార్జీలు ఏపీ కన్నా కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయి.. ఆర్టీసీ ఛార్జీలు మహారాష్ట్రలో ఎక్కువ, మరి రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావు చంద్రబాబూ..? అంటూ ప్రశ్నించారు. రాజకీయ సన్యాసం…