వారాహి యాత్రలో రెండు చెప్పులు పోయాయి అంటున్న పవన్.. ప్యాకేజీ స్టార్ అని అందరికీ తెలుసు.. చంద్రబాబు ఇంటికి వీధి గుమ్మంలో వెళ్లిన పవన్.. ప్యాకేజీ తీసుకుని దొడ్డి దారిన వెళ్లిపోయారు. అక్కడే రెండు చెప్పులు వదిలేశారు.. చంద్రబాబు ఇంటికి వెళ్లి వెతికితే ఆ రెండు చెప్పులు దొరుకుతాయి అంటూ ఎద్దేవా చేశారు గ్రంధి శ్రీనివాస్.
Bro Teaser: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అని పాడుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్. మరి భీమ్లా నాయక్ తరువాత పవన్ ను వెండితెర మీద చూసే ఛాన్స్ వచ్చేసింది. ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా పవన్ మాత్రం సినిమాలను వదలడం లేదు. ప్రస్తుతం పవన్ నటించిన చిత్రం బ్రో. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. మొట్టమొదటి సారి మేనమామతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.
Bro Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బ్రో. సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vijay Antony: బిచ్చగాడు 2 తో ఈ ఏడాది సెన్సేషన్ సృష్టించాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బిచ్చగాడు 2.. భారీ విజయాన్ని అందుకొని రికార్డులను కొల్లగొట్టింది. విజయ్ ఆంటోనీ పేరు తెలుగులో చాలాకాలం వినిపించేలా చేసిన సినిమా బిచ్చగాడు. ఇక ఈ సినిమా విజయం తరువాత విజయ్ నుంచి వస్తున్న మరో చిత్రం హత్య.
Pawan Kalyan: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కిస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్, సీఎం జగన్ మధ్య మాటల యుద్ధం మరింత ఘాటుగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక పవన్ వారాహి విజయ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. రెండు రోజుల క్రితమే ఆయన అస్వస్థతకు గురయిన విషయం తెల్సిందే.
Bro Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా సముతిరఖని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించాడు.
వారిలా ఊగుతూ మనం మాట్లాడలేం.. వారిలా మనం రౌడీల్లా మీసాలు మెలేయలేం.. వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం.. బూతులు మాట్లాడలేం.. వారిలా నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోలేం.. నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం.. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థలను నాశనం చేయలేం.. రోడ్డుపైకి తీసుకురాలేం.. వారిలా అలాంటి పనులు మనం చేయలేం.. అవన్నీ వారికే పేటెంట్ అంటూ హాట్ కామెంట్లు చేశారు సీఎం వైఎస్ జగన్.