AP Volunteers Protest Against Pawan Kalyan Comments: వాలంటీర్ వ్యవస్థపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గిరాజేశాయి. కొందరు వైసీపీ నేతలు వాలంటీర్ల సహకారంతో వివరాలు సేకరించి, హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని చేసిన కామెంట్లు.. వాలంటీర్లను నొప్పించాయి. దీంతో.. వాళ్లు పవన్‌కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రావ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తున్న వాలంటీర్లు.. పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మల్ని దగ్దం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో సేవే పరమావదిగా భావిస్తూ.. వృద్ధుల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు పక్కాగా చేరుస్తూ.. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు ప్రజలకు వారధిగా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు రాజకీయాల్ని ఆపాదించి, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటూ అవమానించడం దారుణమని మండిపడుతున్నారు.
Devineni Avinash: టీడీపీ నేతల మాటలు జోకర్ల మాటల్ని తలపిస్తాయి.. దేవినేని అవినాష్ విసుర్లు
తాము కరోనా సమయంలో ఎంతో సేవ చేశామని.. కానీ మీరేం చేశారంటూ పవన్ కళ్యాణ్‌ని వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌లో వాలంటీర్ల హస్తం ఉందని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్.. ఆ నిఘా సంస్థ అయితే తనకు డేటా ఇచ్చిందో, అందుకు సంబంధించిన వివరాల్ని శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలని కోరుతున్నారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. అసలు తమ వాలంటీర్లు ఏం చేశామని పవన్ ఇలా వ్యాఖ్యానించారంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బహిరంగంగా మాట్లాడిన మాటలపై తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలపై, వాలంటీర్ వ్యవస్థపై ఏమాత్రం గౌరవం ఉన్నా.. పవన్ క్షమాపణ చెప్పాలని అంటున్నారు. లేకపోతే.. యావత్ మహిళా లోకం సరైన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ప్రజాసేవ చేస్తున్న వాలంటీర్లను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని, చాలా జాగ్రత్తగా ఉండాలని, తమని తక్కువ చేసి చూడొద్దని పేర్కొంటున్నారు.
ఇదే సమయంలో.. మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించారు. రాష్ట్ర ప్రజానీకం వాలంటీర్ వ్యవస్థను కొనియాడుతోందని.. కరోనా సమయంలో వాలంటీర్లు రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవ చేశారని వ్యాఖ్యానించారు. కానీ.. కరోనా టైంలో పవన్ మాత్రం తన ఫాంహౌజ్‌లోనే పడుకున్నాడని, వాలంటీర్ల మాదిరిగా ప్రజలకు సేవ చేయలేదని విమర్శించారు. వాలంటీర్లలో ఎక్కువశాతం మహిళలే ఉన్నారని, మహిళలంటే పవన్‌కు ఏమాత్రం గౌరవం లేదని విరుచుకుపడ్డారు. పవన్‌కు సిగ్గు, శరం లేదని.. వాలంటీర్లకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.