చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రెండేళ్లు జైలుకు వెళ్లిన వ్యక్తి, రిచెస్ట్ సీఎం.. కానీ ఏమి పని చేశాడో తెలియదని విమర్శించారు. హఠాత్తుగా ఆస్తులు పెంచేసుకుని, అక్రమంగా డబ్బులు సంపాదించిన వారంతా రాజ్యాధికారం దక్కించుకున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరినీ నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన అంశంలో తన మద్దతు ఉంటుందని చెప్పారు.
RGV: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండకపోతే వర్మకు నిద్రపట్టదు. ఇక ఈ మధ్య పాలిటిక్స్ లో యమా యాక్టివ్ గా ఉంటున్న వర్మ ..
పవన్ కళ్యాణ్ నడిరోడ్డుపై పడుకోవడంపై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అవినీతి బాబుని అరెస్ట్ చేస్తే నీకు ఇదేమి కర్మ "BRO" అంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ ను పెట్టాడు.
AP Police Stopped Pawan Kalyan at Garikapadu Checkpost: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇక ఆయన అరెస్టు ఖండించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతుగా ఆయనని కలిసేందుకు విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్ళడానికి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు పవన్ కళ్యాణ్ వెళ్లగా ఆయన వెళ్లే విమాననానికి అనుమతి లేదని అధికారులు వెనక్కి పంపారు. ఈ క్రమంలో…
మీరా చోప్రా.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఈ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన బంగారం సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో తెలుగు లో అంతగా అవకాశాలు రాలేదు. అయితే రీసెంట్ గా హీరోయిన్ మీరా చోప్రా వరుసగా ఉదయనిధి స్టాలిన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు పెడుతోంది.ప్రముఖ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్…
పవన్ కల్యాణ్ వస్తుంటే మీరు ఎందుకు భయపడుతున్నారని నాదెండ్ల ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వచ్చి మంగళగిరి పార్టీ ఆఫీసులో భవిష్యత్తు కార్యచరణ నిమిత్తం సీనియర్ నాయకులతో సమావేశం నిమిత్తం రానున్నారని తెలిపారు.
గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గర పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. కాసేపట్లో గన్నవరం విమానాశ్రయంకు పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. అయితే పవన్ ను బయటకు వెళ్ళకుండా ఆపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర ప్రధానమైనదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా.. మంచి నిర్ణయాలను, కార్యక్రమాలను సమర్ధిస్తామన్నారు. కానీ ప్రజాస్వామ్య విరుద్దంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేస్తే ప్రశ్నించకుండా ఎలా ఉంటామన్నారు.