పొలిటికల్ కరప్షన్ లేని జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని 2024లో తీసుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయితీల జోలికి ఎవరూ వెళ్ళరు.. సచివాలయ వ్యవస్ధ తెచ్చి, పంచాయితీల విలువ లేకుండా చేశారు అని పవన్ ఆరోపించారు. ప్రతీ జనసేన సమావేశంలో పంచాయితీ నిధుల దుర్వినియోగంపై మాట్లాడాలి, మేనిఫెస్టోలో పెట్టాలి అని విన్నపం చేశారు. పంచాయితీల్లో దొంగలు పడి 8660 కోట్ల రూపాయలు దోచుకున్నారు.. కాగ్ కూడా సచివాలయాల్లో సర్పంచ్ లకు స్ధానం ఇవ్వకపోవడం చట్ట ఉల్లంఘన అని తెలిపింది.. పంచాయితీలకు వచ్చిన సొమ్ములు 24 గంటల్లో వెళ్ళిపోతున్నాయని ఆయన ఆరోపించారు. ఏపీలో వచ్చేది జనసేన- టీడీపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కనుక మేం చర్యలు తీసుకుంటాం.. ప్రతీ సభలో ఈ సమస్యపై మాట్లాడుతాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read Also: MAD Trailer: ఫ్రెండ్స్ మీరు లేకపోతే… నా లైఫ్ ఇంకా మంచిగుండేది… ఈ ట్రైలర్అంతా యూత్ స్టఫ్
కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా అద్భుతంగా ఉంటాయని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. పాలిటిక్స్ అంటే డబ్బు కోసమే అనే పరిస్ధితి వచ్చింది.. పాదయాత్రలో ప్రామిస్ లతో చెప్పలేనన్ని మోసాలు చేసారు.. న్యాయం జరుగనప్పుడు గళం విప్పే హక్కు ఉంది.. 2024లో అలాంటి అవకాశం ఇచ్చే ప్రభుత్వం రానుంది అని ఆయన తెలిపారు. ఇసుకదిబ్బలు ఉండటం దివిసీమ ఉప్పెన సమయంలో ఉపయోగపడింది.. అడ్డగోలుగా ఇసుక డ్రెడ్జింగ్ జరుగకుండా ఒక చట్టం తీసుకురావాలి.. సహజ వనరుల వినియోగంపై భారతీయ శిక్షా స్మృతిలో కఠినమైన చట్టం తేవాలన్నారు. భారతదేశ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత ఐఏఎస్ లకు ఉండాలి.. భవిష్యత్తులో అలాంటి చట్టాలు వస్తాయి.. అధికారులు సరిగ్గా స్పందించకపోతే సరైన దిశగా తీసుకెళ్ళేందుకు, తీర ప్రాంతాలు కోతకు గురవకుండా చర్యలు తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: Gas Cylinder: వామ్మో గ్యాస్ సిలిండర్ ధర రూ.3000 లా.. ఎక్కడంటే..?
చేనేత కార్మికుల పరిస్ధితులు చాలా దయనీయంగా ఉన్నాయని జనసేన చీఫ్ పవన్ అన్నారు. చేనేతని బ్రతికించుకోవాలి.. చేనేత ప్రొడక్ట్ లకు నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను.. పచ్చటి పొలాల మధ్యలో ఆకలి చావులుంటాయి అనుకోం.. నెలవారీ పెన్షన్లు కూడా తీసేస్తారేమో అనే భయం ఉండకూడదు.. ఉత్పత్తి కులాలకు ఆకలి చావులు ఉండకూడదు అని ఆయన అన్నారు. చేనేత కార్మికులకు వ్యక్తిగతంగా సహకారం అందించడానికి సిద్ధం అని పవన్ అన్నారు. ఇక, బ్రిటిష్ కాలంలో మన పెద్దలు ఇచ్చిన స్ధలాల్లో ఈ కాలేజీలు పెట్టారు.. ఎయిడెడ్ కళాశాలలు రద్దు చేయడం చాలా దారుణం.. కాలేజీలను చంపేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాలుగా మాత్రమే దానిని చూస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
Read Also: Asha Workers: కరీంనగర్ లో ఉద్రిక్తత.. మంత్రి గంగుల ఇంటి ముందు ఆశా వర్కర్ల ఆందోళన
దాతలు ఇచ్చిన స్ధలాలు ఎండోమెంట్ బోర్డుకు ఎలా మళ్ళించారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అసెంబ్లీకి అయినా వెళ్ళాలి.. మన ప్రభుత్వం వస్తే ఒక పాలసీ తేవాలి అని ఆయన అన్నారు. సమగ్రశిక్షలో కాంట్రాక్టు వృత్తివిద్యా టీచర్ల జీతాలు కూడా ఆగిపోయాయని, ఉద్యోగాలు కూడా పోతాయని ఉద్యమాలు చేయట్లేదని, మద్దతు కావాలని కంప్లైంట్ చేశారు.. అలాగే, ఖబరస్తాన్ లలో ఒక బాడీని పాతిపెడితే మరో బాడీ పాతడానికి స్ధలం లేదు.. జనసేన ప్రభుత్వం రాగానే వారి సమస్యలను పట్టించుకోవాలని ముస్లిం మైనారిటీల కంప్లైంట్ చేశారు అని పవన్ తెలిపారు. పార్ధివ దేహాలు పాతిన చోటే మరలా పాతాల్సిన దుస్థితి విశాఖలో కూడా విన్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. మార్చురీ వ్యాన్ కూడా లేదని వినడం దురదృష్టకరం.. జనసేన ప్రభుత్వం రాగానే వసతులతో కూడిన స్మశానవాటికి అందుబాటులోకి తెస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.