Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ ఫాన్స్‌కు నిరాశ.. అప్‌డేట్స్ అన్నీ క్యాన్సిల్!
- నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు
- అప్‌డేట్స్‌ను క్యాన్సిల్ చేసిన నిర్మాణ సంస్థలు
- నిరాశలో పవర్ స్టార్ ఫాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Fans are Disappointed after No Updatefrom OG: నేడు ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. బర్త్‌డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ నేపథ్యంలో పవన్ ఫాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ప్రకటిస్తామని చెప్పిన నిర్మాణ సంస్థలు అభిమానులను నిరాశకు గురిచేశాయి. తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నేడు విడుదల కావాల్సిన అప్‌డేట్స్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు వెల్లడించాయి.
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘ఓజీ’. పవన్ పుట్టినరోజు నాడు ఓజీ అప్‌డేట్స్ ఇస్తామని ఇటీవల నిర్మాణ సంస్థ ప్రకటించింది. అప్‌డేట్ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు పోస్టర్ కూడా రిలీజ్ చేయడం లేదని పేర్కొంది. ‘ఏపీ, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా బర్త్‌డే కంటెంట్ రిలీజ్‌ను క్యాన్సిల్ చేస్తున్నాం. ఓజీ కొన్నేళ్ల పాటు సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. త్వరలోనే భారీ సెలబ్రేషన్స్ చేసుకుందాం’ అని పేర్కొంది.
Also Read
- BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
- Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఇది కూడా క్యాన్సిల్ అయింది. ‘పవన్ ఫ్యాన్స్ కోసం ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను ఈరోజు రిలీజ్ చేద్దామనుకున్నాం. వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో పోస్టర్ రిలీజ్ చేయడం సరికాదు. ఫాన్స్ అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం’ అని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. రెండు అప్‌డేట్స్ క్యాన్సిల్ అవ్వడంతో పవర్ స్టార్ ఫాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.
తాజావార్తలు
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..