భారత దేశానికి స్వాతంత్య్రం రక్త పాతంతో వచ్చిందని.. సరదాగా సందడి చేస్తే రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రెండు దేశాలు విడిపోతున్న సమయంలో మతోన్మాదంతో ప్రజలను ఊచకోత కోశారని ఆవేదన వ్యక్తం చేసారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన యోధులను జనసేన ఆదర్శంగా తీసుకుందన్నారు.
మనకి స్వాతంత్య్రం రావడానికి కొన్ని వేల రక్త తర్పణాలు జరిగాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్వార్థం లేకుండా ఎంతో మంది చేసిన త్యాగమే స్వాతంత్ర్యమని ఆయన అన్నారు. మనకు స్వాతంత్య్రం ప్రశాంత వాతావరణంలో రాలేదని వెల్లడించారు.