BRS KTR: పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- ఏ తప్పు చేయని పట్నం నరేందర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు..
- నా కోసం కాదు ప్రజలకోసం పోరాటం చేస్తున్నానని పట్నం నరేందర్ రెడ్డి అన్నారు..
- మాకంటే పట్నం నరేందర్ రెడ్డి ధైర్యంగా ఉన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS KTR: పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారని బీఆర్ఎస్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు కలిసి పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కక్ష పూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు జైల్లో నరేందర్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. కొడంగల్ లో దళిత, గిరిజన, బహుజన భూములు గుంజుకొని అక్కరలేని ఫార్మా విలేజ్ ను రుద్దుతున్నారని మండిపడ్డారు. వారికోసం పోరాటం చేయండని చెబుతూ బాధపడుతున్నారన్నారు. సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలు వరకు తప్పు చేయని అమాయకులు జైల్లో ఉన్నారన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె వరకు అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కి కూర్చున్నారని తెలిపారు. కొడంగల్ లో అర్ధరాత్రి పూట ఇళ్లపై పడి మహిళలు, పిల్లలపై అరాచాకలు చేస్తూ పేద రైతుల భూములు గుంజుకుంటున్నారని అన్నారు.
Read also: Damodar Raja Narasimha: ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర టెలీ కాన్ఫరెన్స్..
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లిలో మాజీ సర్పంచ్ 85 ఏళ్ల సాయిరెడ్డి అనే వ్యక్తి పై పగబట్టారు. రేవంత్ రెడ్డి కోసం ఆయన మొన్నటి ఎన్నికల్లో పనిచేశారని తెలిపారు. కానీ ఆయన ఇంటికి అడ్డంగా గోడకట్టి తోవ లేకుండా చేశారు. ఆ క్షోభ, అవమానంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. నియంతలు, దుర్మార్గుల పాలనలోనే ఇలాంటి సంఘటనలు చూస్తుంటాం. గతంలో మేము అధికారంలో ఉన్నాం. ఎప్పుడైనా ఇలాంటి ఘటనల గురించి విన్నామా? అని ప్రశ్నించారు. సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే నీ సామ్రాజ్యమా, నువ్వు చక్రవర్తివా? వెయ్యి ఏళ్లు బతకటానికి వచ్చావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు, పేద, గిరిజన రైతుల కుటుంబాల మీద అర్థరాత్రి బందిపోట్ల మాదిరిగా పోలీసులు దాడి చేస్తున్నారని తెలిపారు. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తూ సాయిరెడ్డి, గురువా రెడ్డి లాంటి వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేశారని తెలిపారు.
Read also: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్..
సొంత గ్రామంలో చేస్తున్న అరాచకాల పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. నీ కన్నా పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారన్నారు. మా నేత నరేందర్ రెడ్డి చాలా ధ్యైర్యంగా ఉన్నాడు. పేదలు, గిరిజన రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారని తెలిపారు. మహబూబాబాద్ లో మేము చేపట్టనున్న ధర్నా బాగా చేయాలంటూ మాకు ఉత్సాహానిచ్చారన్నారు. నరేందర్ రెడ్డి చేయని తప్పునకు జైల్లో ఉన్న 30 మంది అమాయక రైతుల కుటుంబాలకు ఒకటే చెబుతున్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీ వెనుక కేసీఆర్ ఉన్నారని భరోసా ఇచ్చారు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని నాలుగు రోజులు జైల్లో పెట్టవచ్చు.. కానీ ఆయనకు మళ్లీ రాజకీయ జీవితం లేకుండా చేసే బాధ్యత మీ మీద ఉందన్నారు.
Bandi Sanjay: బీజేపీ ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుంది..
తాజావార్తలు
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
ట్రెండింగ్
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!