Nagarkurnool: దవాఖానలో గుంపులుగా వీధి కుక్కలు.. భయాందోళన లో పేషెంట్లు
- నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కల స్వైర విహారం..
- ఆస్పత్రి వార్డుల్లో తిరుగుతున్న వీధి కుక్కలు..
- రోగుల ఆహారం లాక్కెళ్లి తింటున్న శునకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarkurnool: ఆస్పత్రిలో కుక్కలు సంచరిస్తుండటంతో రోగులు భయాందోళనకు గురవుతున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం జనరల్ దవాఖాన, ప్రాంగణంలో వీధి కుక్కలు స్వైర విహారంతో పేషెంట్లు బెంబేలెత్తుతున్నారు. దాదాపు ఏడు వీధి కుక్కలు దవాఖానలోకి ప్రవేశించాయి. కుక్కల ఒకే సారి గుంపులుగా వచ్చి ఆస్పత్రి ఓపీ గది ముందు సంచరించాయి. చాలా సేపు ఓపీ గది ముందు బైఠాయించాయి. అనంతరం ఆసుపత్రి ఆవరణలో తిరుగుతూ రోగులను భయాందోళనకు గురిచేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కుక్క కనిపిస్తేనే భయంతో పరుగులు పడతాం.. అలాంటిది ఆసుపత్రిలో ఒకే సారి కుక్కల గుంపును చూసిన ఓ వ్యక్తి అక్కడి నుంచి పరుగులు పెట్టాడు.
ఆసుపత్రి సిబ్బంది కుక్కల గుంపును వెళ్లగొట్టకపోవడంతో రోగులు, వారి బంధువులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల గుంపు ఆస్పత్రి వార్డుల్లో తిరుగుతూ రోగుల ఆహారం లాక్కెళ్లి తింటున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మరోవైపు ఆడుకుంటున్న చిన్నారులపై వీధికుక్కలు దాడి చేసిన ఘటన వనపర్తి జిల్లా అమరచింతలోని శ్రీకృష్ణనగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు అభినాష్, అక్షయ్ కుమార్ ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేశాయి. అక్షయ్ కుమార్ ఎడమ చెవిపై, అభినాష్ వీపుపై గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం అక్షయ్‌కుమార్‌ను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించగా, అభినాష్‌కు స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. కాలనీలో వీధికుక్కల బెడద ఎక్కువైందని, మున్సిపల్ అధికారులు వీటిని నగరానికి దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
Khairatabad Ganesh: హుస్సేన్ సాగర్ నుంచి ఖైరతాబాద్ గణపతి అవశేషాల తొలగింపు..
Also Read
- ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..
- Ragging: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. గతేడాది బాధితుడే.. నేడు నిందితుడు..!
- Karthika Pournami: శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివాలయాల్లో భక్తుల పూజలు..
- Srisailam Ghat Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు..
తాజావార్తలు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!