ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పవర్ కట్‌తో వైద్యులు, రోగులు ఇబ్బంది పడ్డారు. సుమారు గంటకుపైగా కరెంట్ రాలేదు. దీంతో వైద్యులు తమ మొబైల్ ఫోన్లలోని టార్చిలైట్ వెలుగులో రోగులకు చికిత్స అందించారు. బల్లియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. అక్కడ భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, రోగులు ఇబ్బంది పడ్డారు. గంటకుపైగా కరెంట్ రాలేదు. ఆసుపత్రిలోని జెనరేటర్ పని చేయలేదు. అత్యవసర లైట్లు…
రోబోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, తెలుగులో రోబో సినిమా రావడానికి ముందే హాలీవుడ్‌లో ఐ రోబోట్ సంచలనం సృష్టించింది. రోబోలపై ప్రపంచానికి క్రేజ్ కలిగించిన చిత్రం అది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోబోలను ఈ సినిమాలో రూపొందించారు. అన్ని పనుల్లోనూ అవి సాయం చేస్తుంటాయి. నేడు ఆధునిక కాలంలో మనిషి కోరుకుంటున్నవన్నీ చేసిపెట్టే మరో మనిషి రోబో. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు దోహదం చేయబోతోందనే చెప్పొచ్చు. ఇలాంటి రోబోను మనం సినిమాలోనే కాదు నిజ జీవితంలో…
ఏపీ పర్యటనలో భాగంగా ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి భారతీ పవార్. మంగళగిరిలో ఏర్పాటుచేసిన ఎయిమ్సును సందర్శించిన కేంద్ర మంత్రి భారతీ పవార్.. అక్కడ అందుతోన్న సేవలపై రోగుల నుంచి ఆరా తీశారు. మందులు అందుతున్నాయా..? లేదా అంటూ రోగుల బంధువులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి పవార్. జనరిక్ మెడిసిన్ అందుబాటులో ఉన్నాయా..? లేవా..? అంటూ ఆరా తీశారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు గురించి కేంద్ర మంత్రి అడిగారు. అయితే, ఆయుష్మాన్…
డాక్టర్లను మనం దేవుళ్లతో పోలుస్తాం. ఎందుకంటే.. ప్రాణపాయ స్థితి నుంచి కాపాడుతారు కాబట్టి! ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలొచ్చినా, దాన్ని నయం చేస్తారనే నమ్మకంతో రోగులు వారి వద్దకే వెళ్తారు. అందుకే.. రోగి కోసం డాక్టర్ వెయిట్ చేయొచ్చు గానీ, డాక్టర్ కోసం రోగి వెయిట్ చేయకూడదంటారు. బహుశా కాసేపు వేచి చూసినా, డాక్టర్ వస్తాడన్న నమ్మకమూ రోగుల్ని బ్రతికిస్తుంది. కానీ, ఆ నమ్మకమే ఒమ్మై డాక్టర్లు అందుబాటులోకి రాకపోతే? ఆ రోగి పరిస్థితి ఏంటి? సరిగ్గా…
జైళ్లలో ఉన్న ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలిన ఘటన అసోంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది… రాష్ట్రంలోని సెంట్రల్ జైలు, నాగావ్‌లోని ప్రత్యేక జైలులో గత నెలలో ఈ కేసులు వెలుగు చూశాయి… రెండు జైళ్లలో కలిపి ఏకంగా 85 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలడంతో.. అధికారులు తలలు పట్టుకుంటున్నారు.. ఇక, ఈ ఘటనపై నాగావ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ పటోర్ వివరణ ఇస్తూ.. ఖైదీల్లో ఎక్కువ మందికి హెచ్‌ఐవీ పాజిటివ్ అని…