పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ, యోగా గురువు బాబా రామ్‌దేవ్‌లు తప్పుడు ప్రకటనలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి సుప్రీంకోర్టులో కొత్త అఫిడవిట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ అఫిడవిట్‌లో ఆర్డర్‌ను పూర్తిగా పాటిస్తామని చెప్పారు. తప్పుదారి పట్టించే ప్రకటనకు సంబంధించి పతంజలి వివరణాత్మక సమాధానం దాఖలు చేసింది.
Patanjali: ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబాకు చెందిన ‘పతంజలి’ తప్పుడు ప్రకటనలో కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి ఆయుర్వేద్ ‘తప్పుదోవ పట్టించే, తప్పుడు ప్రకటనల’ కేసులో కేంద్రం తీరుపై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి ప్రకటనల ద్వారా దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఈ రోజు పేర్కొంది. ఇది చాలా దురదృష్టకరమని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.