ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ విచారణ జరపాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. ఆ పిల్‌పై విచారణ చేపట్టింది న్యాయస్థానం.. అయితే, ప్రవీణ్ ను హత్య చేశారని కోర్టుకు తెలిపారు పిటిషనర్ కేఏ పాల్.. మరోవైపు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది హైకోర్టు..
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్.. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానస్పద మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు చెప్పారని వెల్లడించారు.. హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు వచ్చేలోపు ప్రవీణ్ ఆరుగురితో మాట్లాడినట్టు గుర్తించాం..
Pastor Praveen: హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. వివిధ కోణాల్లో పూర్తిస్థాయి నివేదికలతో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు రేపు మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. రాజమండ్రిలోని లలితా నగర్ ప్రాంత వాసి దేవబత్తుల నాగమల్లేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. స్థానిక వీఆర్ఓ ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న మల్లేష్ ని అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి మూడవ పట్టణ పోలీసులు తెలిపారు. కోర్టులో ప్రవేశ పెట్టిన మల్లేష్ కు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు.
Pastor Praveen : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ మిస్టరీ డెత్ కేసుపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కీలక ప్రకటన చేశారు. పాస్టర్ ప్రవీణ్ ఈనెల 24వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి, రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఐజీ అశోక్ మాట్లాడుతూ, “పాస్టర్ ప్రవీణ్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 1 గంటకు చౌటుప్పల్ టోల్…
హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి రాజమండ్రి సమీపంలో కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ కేసు ప్రమాదమా? పన్నాగమా? అనే మిస్టరీ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి ముందు 12 సెకండ్ల ముందు ఏం జరిగింది?, ఆ సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్ ఆధారంగా జరిగిన పరిణామాలపై పోలీసుల దృష్టి కేంద్రీకృతమైంది. ఇంతకుముందు బైక్ వెనుక ఐదు వాహనాలు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ రికార్డింగ్ తేల్చగా.. ఈ వాహనాల…