“మళ్ళీ కూయవే గువ్వా…మోగిన అందెలమువ్వ… తుళ్ళి పాడవే పువ్వా… గుండెల సవ్వడి మువ్వా…” – ఈ పాట అప్పట్లో కుర్ర కారు గుండెలను మీటింది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ లోని ఈ పాటతోనే గీత రచయిత కందికొండ యాదగిరి చిత్రసీమకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే తన కవితాశోభను జనానికి పరిచయం చేయగలిగారు కందికొండ. దర్శకుడు పూరి, సంగీత దర్శకుడు చక్రి సైతం ఆయనలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ అదే చిత్రంలో “నీకోసం వేచి వేచి…