రైళ్లు ఎందుకు ఆలస్యంగా నడుస్తాయంటే షెడ్యూలింగ్‌లో అనూహ్యమైన మార్పులు చేర్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సిగ్నలింగ్ సమస్యలు, అనుకోని అంతరాయాలు.. ఇలా పలు కారణాలు చెప్పొచ్చు. అయితే పశువుల వల్ల కూడా రోజుకి సగటున 11 రైళ్లు లేట్‌గా రాకపోకలు సాగిస్తున్నాయని రైల్వే శాఖ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల రైల్వేలకు భారీగా నష్టాలొస్తున్నాయి. మేత కోసం పశువులు రైల్వే ట్రాక్‌ల మీదికి వస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. అదే సమయంలో రైళ్లకు ఆటంకం…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో కరోనా కారణంగా నిలిచిపోయిన 12 ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. అయితే ఇకపై ఇవి అన్‌రిజర్వుడు ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది. ఫలితంగా ఆయా రైళ్లలో టిక్కెట్ ఛార్జీలు పెరగడంతో పాటు అవి ఆగే స్టేషన్ల సంఖ్య కూడా పరిమితం కానుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారిన ప్యాసింజర్ రైళ్లు:✤ కాచిగూడ-మిర్యాలగూడ-కాచిగూడ (07276/07974). ఈ నెల 11 నుంచి అందుబాటులోకి వస్తుంది.✤ మిర్యాలగూడ-నడికుడి-మిర్యాలగూడ (07277/07273). ఈ రైలు…
బెజవాడలో నేటి నుండి ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కాయి. కరోనా కారణంగా రద్దయిన రైళ్లు ఈరోజు నుండి ప్రారంభం అయ్యాయి. కానీ ఈ ప్యాసింజర్ రైళ్లలో ఎక్స్ ప్రెస్ చార్జీల మోత మోగుతుంది. ఇకపై 30 నుండి 200 శాతం అదనంగా టికెట్ ధర వసూలు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మార్చారు. అయితే పెరిగిన ఈ టికెట్ ధరలతో వలస కార్మికులకు, మధ్యతరగతి ప్రజలపై మొయ్యలేని భారం పడుతుంది. ఇక పెరుగుతున్న…