KTR: సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.. రేవంత్‌కు దమ్ముంటే 10 మందితో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.. ఎన్నికల్లో ఎవరి సత్తా ఏందో తేల్చుకుందామన్నారు.. జోగులాంబ జిల్లా గద్వాలలోని తేరు మైదానంలో నిర్వహించిన ‘గద్వాల గర్జన’ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయన్నారు.
దేశ మంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వెలువడింది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.. ఈ అంశంపై పార్టీ మారిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు.
ఎంపీ సీఎం రమేష్ నాయుడు, ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడుపై పొట్లదుర్తి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సొంత గ్రామం కోసం సీఎం రమేష్ ఎంపీగా ఒక్క మంచి పని అయినా చేశారా? అని ప్రశ్నించారు. ఎంపీగా సొంత గ్రామంలో ఒక్క అభివృద్ధి పని చేశావా? అంటూ నిలదీశారు.. సొంత సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయలేదన్నారు. కాంట్రాక్టు పేరుతో పనులు చేస్తామని చెప్పి బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారన్నారు.
Krishna Mohan Reddy : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన ఫొటోను కాంగ్రెస్ ఫ్లెక్సీలపై చూసి హైరానా పడ్డారు. “ఏమిటీ! నా అనుమతి లేకుండా నా ఫొటో పెట్టారు? నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా చేశారు!” అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలను చూసి బాధపడటమే కాక, వాటిని పెట్టిన వారిపై కేసులు కూడా నమోదయ్యాయని తెలుస్తోంది. “నేను కాంగ్రెస్ లో చేరానా, లేదా మరి ఫొటో మాత్రం చేరిపోయిందా?” అని ఆయన ముక్కు…
Telangana MLAs: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు తమ పార్టీ మార్పుపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి నోటీసుల్లో పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి. అయితే, ఈ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వడానికి మరింత సమయం కావాలని కోరుతున్నారు. అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన ఈ…
పార్టీ మారిన కార్పొరేటర్లను వారి విజ్ఞతకే వదిలేద్దామని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్‌లో కడప మున్సిపల్ కార్పొరేటర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.