ఈరోజు ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎంతో సేవ చేశానని తెలిపారు. ఎన్నికల్లో ఎవరో చెబితో ప్రజలు ఓట్లు వేయరు.. వారికి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటేస్తారన్నారు. అది ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ఎంతో చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు…
కేసీఆర్ ప్రభుత్వ కాలంలో 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మతం పేరుతో రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ముస్లిం షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
సమాజ భద్రత కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడే పోరాట యోధుడే పోలీస్ అని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. అధునాతన వ్యవస్థలను ఉపయోగించుకుని నేరాలకు పాల్పడుతున్న వారిని ఎదుర్కోవలసిన బాధ్యత నేటి పోలీసులపై ఉంది అని ఆయన తెలిపారు.
అమర్‌నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. దక్షిణ కాశ్మీర్‌లోని గుహ మందిరంలో 4.4 లక్షల మంది యాత్రికులు ప్రార్థనలు చేయడంతో వార్షిక అమర్‌నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. 62 రోజుల పాటు యాత్ర సాగింది.
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ వేడుకల్లో రాష్ట్ర రోడ్డు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని.. జలహారతి ఇచ్చారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర 6 వ రోజున చేరుకుంది. ఇవాళ భట్టి పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొననున్నారు. నేడు కొమురం భీం జిల్లా జామ్నే నుంచి కెరమెరి ఘాట్ రోడ్ మీదుగా కెరమెరి మండల కేంద్రము వరకు పీపుల్స్ మార్చ్ సాగనుంది.