సీఎం కేసీఆర్ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ కురిపిస్తున్నారంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెప్ పార్టీ ఏం చేసిందని టీఆర్ఎస్ నాయకులు పదేపదే అడుగుతున్నారని చెప్పిన ఆయన.. ఈ 8 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, రైతులకు రుణమాఫీ కూడా చేయలేదని ఆరోపించారు. లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే.. మొదటి సంతకం చేసింది…