Crow Attack on MP: పార్లమెంట్ ఆవరణలో ఎంపీపై కాకి దాడి.. వైరల్‌గా మారిన ఫొటోలపై బీజేపీ సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crow Attack on MP: పార్లమెంట్ ఆవరణలో ఓ ఎంపీపై కాకులు దాడి చేశాయి.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కాకుల దాడి నుండి తప్పించుకుంటున్నట్లు ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు బుధవారం రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా.. పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో, పార్లమెంటు ఆవరణలో ఒక కాకి అతడిపై దాడికి యత్నించింది.. కాకి బారి నుంచి ఎంపీ తప్పించుకుంటున్నారు.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కాకుల దాడి నుండి రాఘవ్ చద్దా తప్పించుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే, రాఘవ్ చద్దాపై కాకి దాడి ఘటన తర్వాత, ఢిల్లీ భారతీయ జనతా పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ చిత్రాన్ని అందరితో పంచుకుంది. కాకి కరిచింది అంటూ ఢిల్లీ బీజేపీ హేళనగా రాసుకొచ్చింది.. ఈ రోజు వరకు నేను విన్నాను, ఈ రోజు కూడా నేను అబద్ధాల కోరును.. కాకి కరిచినట్లు చూశాను! అంటూ కామెంట్ పెట్టింది. మరోవైపు నెటిజన్లు కూడా ఈ ఘటనపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు.. ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని ఓ ట్విట్టర్ యూజర్ రాశారు. పార్లమెంట్ ఆవరణలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను కాకి గుచ్చేసింది అని పేర్కొంటే.. అన్షుమాన్ అనే వినియోగదారు తాంజియా యాసలో రాస్తూ.. కాకులు కూడా అతన్ని విడిచిపెట్టడం లేదని రాశాడు.. ఇక, ఈ ఘటనపై సానుభూతి వ్యక్తం చేస్తూ మరో ట్విట్టర్ యూజర్ విక్రమ్ తివారీ.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పార్లమెంట్ కాంప్లెక్స్‌లో కాకి కొట్టిందని రాశారు. గుండె చాలా కలత చెందిందని వ్యాఖ్యానించారు.
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ఇక, మణిపూర్ హింసాకాండపై మాట్లాడిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను వర్షాకాల సమావేశానికి సస్పెండ్ చేయడంపై రాఘవ్ చద్దా మాట్లాడుతూ, మణిపూర్‌లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 మరియు 356 ఉల్లంఘించబడడమే కాకుండా, అక్కడ మానవత్వం కూడా సిగ్గుపడేలా ఉందని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. శాంతిభద్రతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో లేకుండా పోయాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే మణిపూర్‌లోని బీరెన్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
झूठ बोले कौवा काटे 👇
आज तक सिर्फ सुना था, आज देख भी लिया कौवे ने झूठे को काटा ! pic.twitter.com/W5pPc3Ouab
— BJP Delhi (@BJP4Delhi) July 26, 2023
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..