Parliament 'assault' case: పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. రాహుల్ గాంధీ తమ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లను నెట్టివేయడంతో వారు గాయపడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో చేర్పించారు. సభలోకి వచ్చే ప్రయత్నంలో రాహుల్ గాంధీ తమను నెట్టారని బీజేపీ చెబుతోంది.
పార్లమెంట్‌లో గురువారం ఎంపీల మధ్య కొట్లాట జరిగింది. అయితే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోసేయడం కారణంగా బీజేపీ ఎంపీ గాయపడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.