Multi Level Parking : హైదరాబాద్ లో పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్త టెక్నాలజీతో ముందుకెళ్తోంది. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ వద్ద 400 గజాలలో మల్టీ లెవల్ పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. దీంట్లో ఒకేసారి 72కార్లను పార్కింగ్ చేయొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద నిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. పార్క్ లోకి వచ్చే వాకర్స్ కార్లను పార్కింగ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే దీన్ని తీసుకొచ్చామన్నారు. Read Also…