Multi Level Parking : హైదరాబాద్ లో పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్త టెక్నాలజీతో ముందుకెళ్తోంది. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ వద్ద 400 గజాలలో మల్టీ లెవల్ పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. దీంట్లో ఒకేసారి 72కార్లను పార్కింగ్ చేయొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద నిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. పార్క్ లోకి వచ్చే వాకర్స్ కార్లను పార్కింగ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే దీన్ని తీసుకొచ్చామన్నారు.
Read Also : The Rajasaab : టీజర్ లో ఆ లుక్ లేదు.. కారణం అదేనా..?
ప్రస్తుతం ఇది ట్రయల్ రన్ లో ఉంది. 10 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. కొరియన్ టెక్నాలజీ తో దీన్ని నిర్మించారు. ఈ మల్టీలెవెల్ పార్కింగ్ కోసం 6 కోట్లు వెచ్చించారు. దీంతో బజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో కొంత మేర పార్కింగ్, ట్రాఫిక్ జామ్ సమస్యలు తగ్గనున్నాయి.
ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత సిటీలోని మిగతా రద్దీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే సిటీలో చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడ్డట్టే అని చెబుతున్నారు.
Read Also : Mega-Anil Movie : మెగా-అనిల్ మూవీలో రేపటి నుంచే నయన్ జాయిన్..
https://www.facebook.com/NtvTeluguLive/videos/2170186126740606/