Djokovic vs Alcaraz: అల్‌కరాజ్‌తో ఫైనల్.. జొకోవిచ్ స్వర్ణ స్వప్నం నెరవేరేనా?
- రసవత్తర పోరుకు రంగం సిద్ధం
- అల్‌కరాజ్‌తో జొకోవిచ్ ఢీ
- ఒలింపిక్ స్వర్ణ స్వప్నం నెరవేరేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Novak Djokovic vs Carlos Alcaraz Final Fight in Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. టెన్నిస్ అభిమానులు కోరుకున్న స్టార్స్ నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కరాస్ గోల్డ్ మెడల్ కోసం తలపడబోతున్నారు. టెన్నిస్ ప్రపంచం కళ్లప్పగించి చూసే ఈ ఆసక్తికర పోరు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇద్దరిలో ఎవరు గెలుస్తారని అందరూ ఆసక్తిగా ఉన్నారు. మరికొన్ని గంటల్లో విజేత ఎవరో తేలిపోనుంది.
సుదీర్ఘ కెరీర్‌లో లోటుగా ఉన్న ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని అందుకునేందుకు సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ అడుగు దూరంలో ఉన్నాడు. వరుసగా ఐదో ఒలింపిక్స్ క్రీడల్లో పోటీపడుతున్న 37 ఏళ్ల జొకోవిచ్.. తొలిసారి పసిడి పోరుకు అర్హత సాధించాడు. పురుషుల టెన్నిస్ సింగిల్స్ సెమీఫైనల్లో ఇటలీ ఆటగాడు లొరెంజో ముసెట్టిపై గెలిచి.. ఒలింపిక్స్ టెన్నిస్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన పెద్ద వయసు్కడిగా రికార్డులో నిలిచాడు.
Also Read
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
- ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
Also Read: Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్.. లక్ష్యసేన్ సాధించేనా?
టోర్నమెంట్ అంతటా నొవాక్ జకోవిచ్ అద్భుతంగా ఆడాడు. ఫిట్‌నెస్ మెరుగుపరుచుకుని.. పారిస్‌లో కనీసం రజత పతకంను ఖాయం చేసుకున్నాడు. గోల్డ్ మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. ఇటీవల వరుసగా గ్రాండ్‌స్లామ్‌లు గెలుస్తున్న కార్లోస్ అల్కరాస్‌పై గెలవాలంటే సెర్బియా దిగ్గజం శ్రమించాల్సిందే. వింబుల్డన్ 2024 ఫైనల్లో జకో ఓడిన విషయం తెలిసిందే. ముఖాముఖి రికార్డులో ఇద్దరూ 3–3తో సమంగా ఉన్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన జకోవిచ్.. 2012 లండన్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు.
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!