Hyderabad : హైదరాబాద్ నగరంలోని పారా మౌంట్ కాలనీలో తెల్లవారుజామున పెద్దఎత్తున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, విదేశీయుల అక్రమ నివాసాలపై ఆధారంగా పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. సుమారు 150 మంది పోలీసులు తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఈ కాలనీని చుట్టుముట్టి సోదాలు ప్రారంభించారు. లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, హెచ్‌ఎన్‌యూ, ఏఆర్ విభాగాలకు చెందిన పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఈ సెర్చ్‌లో నైజీరియా,…
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పారామౌంట్ కాలనీలో విషాదం చోటుచేసుకున్నది. ఇంట్లోని నీటి సంపును శుభ్రం చేసేందుకు ముగ్గురు అన్నదమ్ములైన రాజాక్, ఆనస్, రిజ్వాన్ వెళ్లారు. నీటి సంపులు రాజాక్ దిగుతానని చెప్పడంతో సరే అని అతనికి నీటి సంపులో దింపారు.
తెలంగాణలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజా ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది.. తాజాగా హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.. అయితే.. మొదట ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీలో మాత్రం టెన్షన్ నెలకొంది.. ఆ ప్రాంతంలో ట్రేసింగ్, టెస్టింగ్ విస్తృతంగా నిర్వహిస్తున్నాయి మెడికల్ టీమ్‌లు… కాంటాక్టుల్లోనూ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. దీంతో.. ఆ ప్రాంతంలో మరింత…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హైదరాబాద్‌లో ఎంటరైంది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలినట్టు తెలంగాణ వైద్య శాఖ ప్రకటించింది.. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించడం.. వారికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందించడం జరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఎంట్రీతో అప్రమత్తం అయ్యారు అధికారులు.. ఇక, ఆ ఇద్దరూ మొహిదీపట్నం టోలీచౌకీ ప్రాంత వాసులే కావడంతో.. ఆ…