బాంబు పేలుళ్ల బెదిరింపుతో ఢిల్లీలోని రెండు ప్రధాన పాఠశాలల్లో భయాందోళనలు నెలకొన్నాయి. డీపీఎస్ ఆర్కే పురం, పశ్చిమ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూల్‌కి బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. ఈ మేరకు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీ అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది.
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం పంచాయతీలో అర్ధరాత్రుల్లో మహిళ వింత అరుపులు కొందరి యువకులను భయాందోళనకు గురిచేశాయి. ఎల్.వి.పురం గ్రామం కట్లకణం దగ్గర బైక్‌పై వెళుతున్న యువకులకు చీకట్లో మహిళ కంటపడడంతో యువకులు భయంతో పరుగులు పెట్టారు.
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ రైల్వేస్టేషన్‌లో ఓ పాము హల్‌చల్ సృష్టించింది. 6 అడుగుల పొడవైన పాము కలకలం సృష్టించింది. దీంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. భయంతో వణికిపోయారు. కొందరు పరుగులు తీశారు.
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 13 ఏళ్ల బాలిక మరణించింది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు టార్పాలిన్ మీద దూకింది కానీ ఆమె బరువు కారణంగా ప్లాస్టిక్ టార్పాలిన్ చిరిగిపోవడంతో సీసీ రోడ్డు మీద పడిపోవడంతో బలంగా తలకు గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయింది.
Kagaznagar Train: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైలులో తృటిలో ప్రమాదం తప్పింది. బీబీ నగర్ సమీపంలో రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు.
False Tsunami Alert Goa: సునామీ.. ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రాణాలు ఈ సునామీకి బలైపోయాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఊర్లకు ఊర్లే ఈ సునామీల కారణంగా తుడిచి పెట్టుకుపోయాయి. అయితే ఇప్పుడు దేశంలో అత్యంత రద్దీగా ఉండే టూరిజం స్పాట్ గోవాలో కూడా జనం సునామీ రాబోతుందను కొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికారు. అర్థరాత్రి మోగిన సునామీ సైరన్ వారి కంట కునుకు లేకుండా చేసింది.…
కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ క్రమంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తోంది.. ఇదే సమయంలో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో… థర్మల్ విద్యుత్ ఉప్పత్తికి అంతరాయం తప్పదని.. ఇది దేశంలో విద్యుత్ సంక్షోబానికి దారితీయొచ్చనే వార్తలు గుప్పుమంటుచున్నాయి.. అయితే, దీనిపై ఇప్పటికే కేంద్ర విద్యుత్ శాఖ.. ఆ సంక్షోభానికి నాలుగు కారణాలు ఉన్నాయని ప్రకటించింది.. మరోవైపు.. ఈ ఎపిసోడ్‌పై స్పందించిన కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్.. విద్యుత్ సంక్షోభం ఎదుర్కోబోతున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని…