Pawan Kalyan: అధికారుల పని తీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి!
- ఇంజనీరింగ్ అధికారుల పని తీరుపై అసంతృప్తి
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులతో పవన్ సమీక్ష
- పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్న పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలోని ఇంజనీరింగ్ అధికారుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ.. పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదంటూ అధికారులను నిలదీశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు అటవీ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్వ పథకం సహా ప్రధాన కార్యక్రమాల అమలు స్థితిపై పవన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Also Read: Shree Charani: ఇది మొదటి అడుగు మాత్రమే.. ముందు చాలా ఉంది!
Also Read
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
గ్రామీణ రహదారుల నిర్మాణం, పర్యవేక్షణ కోసం త్వరలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రాథమిక దశలో అడవి తల్లి బాట ప్రాజెక్టును ఈ కొత్త టెక్నాలజీకి అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ఇక సాస్కీ నిధులతో పల్లె పండగ 2.0 అమలు జరుగుతుందని తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి జల్ జీవన్ మిషన్ మరియు స్వమిత్వ పనులను స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. మార్చి నాటికి కోటి స్వమిత్వ కార్డులు ప్రజలకు పంపిణీ చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే సుమారు 761 గిరిజన గ్రామాలను అనుసంధానించే 662 రహదారుల నిర్మాణానికి 1,158 కోట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మరో 2,123 కోట్ల సాస్కీ నిధులతో 4,007 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు, గోకులాలు మరియు డ్రైన్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!